Rains : హమ్మయ్య.. కురిసిన వర్షం, తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం

ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చిరుజల్లులతో ప్రారంభమై భారీ వర్షం పడింది.

Rains : హమ్మయ్య.. కురిసిన వర్షం, తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం

Ap Telangana Rains

Rains : తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మండుటెండల నుంచి కొంత రిలీఫ్ లభించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో వాన కురిసింది. దీంతో వాతావరణం చల్లబడి, ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగింది. విజయవాడలో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. దీంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చిరుజల్లులతో ప్రారంభమై భారీ వర్షం పడింది. కొన్ని రోజులుగా ఎండలతో తీవ్రమైన ఇబ్బందులు పడిన బెజవాడ వాసులు.. వర్షంతో ఉపశమనం పొందారు.

గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నారు. తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. మాడు పగిలే రేంజ్ లో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. తీవ్రమైన ఉక్కపోతతో జనాలు విలవిలలాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పలు ప్రాంతాల్లో వాన కురిసి వాతావరణం చల్లబడింది.

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. సంగారెడ్డి, మెదక్, నిర్మల్, కామారెడ్డి జిల్లాలలోని పలు ప్రాంతాల్లో వాన పడింది. సంగారెడ్డి జిల్లా కంకిలో 51.3 మిల్లీ మీటర్లు, నాగలగిద్దెలో 39.3 మి.మి. వర్షపాతం నమోదైంది. ఇక మెదక్ జిల్లా శంకరంపేటలో 33 మిమీ వర్షం కురిసింది. అకాల వర్షంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. పొల్లాల్లో ఉన్న వరిధాన్యం తడిసి ముద్దవుతోంది.

నాలుగు రోజుల క్రితం వడగండ్ల వర్షం పడి బాన్సువాడలో పలు గ్రామాల్లో పంట నష్టం జరిగింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో రహదారులపై తూకానికి సిద్ధంగా ఉన్న వరిధాన్యం తడిసి ముద్దైంది. చేతికి వచ్చిన పంట తడవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము నష్టపోయామని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Also Read : గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ ఓడిన కాపుల కోటలో ఈసారి గెలుపెవరిది?