Telangana Summer : నెల ముందే డేంజర్ బెల్స్, రాబోయే 5 రోజులు జాగ్రత్త.. తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు

రాబోయే 5 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడం ఆందోళనకు గురి చేస్తోంది.

Telangana Summer : నెల ముందే డేంజర్ బెల్స్, రాబోయే 5 రోజులు జాగ్రత్త.. తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు

Hot Summer

Telangana Summer : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు కక్కుతున్నాడు. మాడు పగిలే ఎండల తీవ్రతతో జనాలు విలవిలలాడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అప్పుడే పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది.

తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. భానుడు భగ భగ మండిపోతున్నాడు. ఓవైపు తీవ్రమైన ఉక్కపోత, మరోవైపు వేడిగాలులు.. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్రంలో సగటున 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. రాబోయే 5 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడం ఆందోళనకు గురి చేస్తోంది. ఎండల తీవ్రత దృష్ట్యా తెలంగాణలోని 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు భగభగమంటున్నాడు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో వచ్చే మూడు రోజులు ఎండలు మరింత పెరుగుతాయని.. వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గరిష్ట పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో 41.7 డిగ్రీలు, జగిత్యాల జిల్లాలో 41.8, పెద్దపల్లి జిల్లాలో 40.6, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 41.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా 32.9 డిగ్రీల సెల్సియస్ పెరగటంతో ఉక్కపోత పెరిగిపోతోంది.

* తెలంగాణలో సగటున 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదు
* పలు జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
* రాబోయే 5 రోజులు మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు
* తెలంగాణలోని 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
* ఉత్తర తెలంగాణ జిల్లాలకు అధికంగా వడగాల్పుల ముప్పు
* ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాలకు ఆరెంజ్ అలర్ట్
* నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్లకు ఆరెంజ్ అలర్ట్
* కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
* మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
* గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Also Read : ఏపీలో సమ్మర్ డేంజర్ బెల్స్.. నెల రోజుల ముందే వడగాల్పులు

 

 

తెలంగాణలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగతున్నాయి. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఇవాళ నిజామాబాద్ లో అత్యధికంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ లో సైతం ఎండ తీవ్రత ఇదే విధంగా ఉంటుందని.. ఇవాళ, రేపు రాష్ట్రంలో వడగాలులు వీస్తాయని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు స్పష్టం చేశారు.

* తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు
* 43 డిగ్రీల మార్క్ దాటిన ఉష్ణోగ్రతలు
* రాబోయే 4 రోజులు మరింత తీవ్రంగా ఉష్ణోగ్రతలు
* 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
* ఉత్తర తెలంగాణ జిల్లాలకు వడగాల్పుల ముప్పు