AP Summer Report : ఏపీలో సమ్మర్ డేంజర్ బెల్స్.. నెల రోజుల ముందే వడగాల్పులు

గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెలలోనే వడగాల్పులు వీస్తున్నాయి.

AP Summer Report : ఏపీలో సమ్మర్ డేంజర్ బెల్స్.. నెల రోజుల ముందే వడగాల్పులు

AP Summer Report : ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. మాడు పగిలేలా ఉన్న ఎండల తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అప్పుడే పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇక నెల రోజుల ముందుగానే పలు జిల్లాల్లో వడగాల్పులు వీయడం టెన్షన్ పెడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. రాష్ట్రంలో సమ్మర్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని.. వడగాల్పుల ముప్పు పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెలలోనే వడగాల్పులు వీస్తున్నాయి. వచ్చే నాలుగు రోజులు 3 నుంచి 5 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని.. విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

Also Read : నెల ముందే డేంజర్ బెల్స్, రాబోయే 5 రోజులు జాగ్రత్త.. తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు