వెదర్ అప్‌డేట్ : ఏపీకి వర్ష సూచన

విశాఖ: వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి. చలితీవ్రత తగ్గుముఖం పట్టింది. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భారత వాతావరణ విభాగం ఏపీకి వర్ష సూచన

  • Published By: veegamteam ,Published On : February 7, 2019 / 04:32 AM IST
వెదర్ అప్‌డేట్ : ఏపీకి వర్ష సూచన

విశాఖ: వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి. చలితీవ్రత తగ్గుముఖం పట్టింది. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భారత వాతావరణ విభాగం ఏపీకి వర్ష సూచన

విశాఖ: వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి. చలితీవ్రత తగ్గుముఖం పట్టింది. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భారత వాతావరణ విభాగం ఏపీకి వర్ష సూచన చేసింది. ఏపీలో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రంపై పశ్చిమ ఆటంకాల ప్రభావం కొనసాగుతోంది. 9వ తేదీ నుంచి మరొక రాష్ట్రం మీదుగా  ప్రయాణించనుంది. అదే సమయంలో ఆగ్నేయ, తూర్పు గాలులు దీనికి తోడు కానున్నాయి. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి వానలకు ఆస్కారం ఉందని భారత   వాతావరణ విభాగం తెలిపింది.

 

ప్రస్తుతం రాష్ట్రం మీదుగా ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. ఫలితంగా పగటి పూట ఉష్ణోగ్రతలు స్వలంగా పెరుగుతున్నాయి. కోస్తాంధ్రలో రాత్రి ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు  తగ్గుతున్నాయి. దీంతో రాత్రి వేళ చలి ప్రభావం ఉంది. ఏపీలో అత్యల్పంగా కళింగపట్నంలో 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. బాపట్ల, తుని, అనంతపురం, నంద్యాలలో 19 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత  నమోదైంది.