నా కల నిజమైంది.. అమితాబ్ సార్‌తో నటించబోతున్నా..
Prabhas – Amitabh Bachchan: రెబల్ స్టార్ ప్రభాస్, ప్రామిసింగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందనున్న ఎపిక్ ఫిల్మ్‌లో లివింగ్ లెజెండ్, బిగ్‌బి అమితాబ్ బచ్చన్ నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
గతేడాది మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’లో గోసాయి వెంకన్న పాత్రలో ఆకట్టుకున్న అమితాబ్ ప్రభాస్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనున్నారు. లెజెండ్ లేకుండా లెజెండరీ ఫిల్మ్ ఎలా చేయగలమంటూ Big Surprise పేరుతో ఓ వీడియో విడుదల చేసింది మూవీ టీమ్.
“అమితాబ్ బచ్చన్ సార్‌తో తెరపంచుకోబోతున్నాను.. కల నిజమైంది” అంటూ డార్లింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణే నటిస్తోంది.