అచ్చం ఆ సినిమాలోలానే.. ఇన్సూరెన్స్ స్కాంలో విస్తుపోయే విషయాలు

సినిమాల్లో చూపించే మంచి నుంచి స్ఫూర్తి పొందుతున్న వారు ఎంతమంది ఉన్నారో తెలీదు కానీ, చెడును మాత్రం ప్రేరణగా తీసుకుని చెలరేగిపోతున్న వారు చాలామందే ఉన్నారు. సినిమాలు చూసి అందులో చెడు నేర్చుకుని నేరాలు, ఘోరాలు, మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. తాజాగా, నల్గొండ జిల్లాలో వెలుగుచూసిన ఇన్సూరెన్స్ స్కాంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బీమా స్కాం చేసిన ముఠా కిరాతకాలు కూడా ఓ సినిమాను ప్రేరణగా తీసుకుని చేసినవేనని తెలిసి పోలీసులే షాక్ అవుతున్నారు.

అచ్చం ఆ సినిమాలోలానే.. ఇన్సూరెన్స్ స్కాంలో విస్తుపోయే విషయాలు

sensational facts in insurance scam: సినిమాల్లో చూపించే మంచి నుంచి స్ఫూర్తి పొందుతున్న వారు ఎంతమంది ఉన్నారో తెలీదు కానీ, చెడును మాత్రం ప్రేరణగా తీసుకుని చెలరేగిపోతున్న వారు చాలామందే ఉన్నారు. సినిమాలు చూసి అందులో చెడు నేర్చుకుని నేరాలు, ఘోరాలు, మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. తాజాగా, నల్గొండ జిల్లాలో వెలుగుచూసిన ఇన్సూరెన్స్ స్కాంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బీమా స్కాం చేసిన ముఠా కిరాతకాలు కూడా ఓ సినిమాను ప్రేరణగా తీసుకుని చేసినవేనని తెలిసి పోలీసులే షాక్ అవుతున్నారు.

కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయిన ”భద్రమ్” అనే రీమేక్ సినిమా చూసి ఈ గ్యాంగ్ నేరాలకు స్కెచ్ గీసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ సినిమాలో.. అనాథలకు ఇన్సూరెన్స్ పాలసీలు చేయించి ముఠా డబ్బు సంపాదిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే చనిపోయినా పర్వాలేదు అనుకున్న వారిని టార్గెట్ చేస్తారు. వారి పేరు మీద వీరే పాలసీలు కడతారు కూడా. కొంత పర్సంటేజ్ ఇస్తామని ఒప్పందం కుదుర్చుకుంటారు. ఆ తర్వాత పాలసీ కట్టడం మొదలు పెట్టిన ఏడాది లోపు వారిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి క్లెయిం చేస్తారు. వాటా ప్రకారం బాధితులకు డబ్బు ఇచ్చేస్తారు.

ఇదే తరహాలో నల్గొండ జిల్లాలో ఆ ముఠా ఇన్సూరెన్స్ స్కామ్ కి పాల్పడింది. పేద కుటుంబాలే లక్ష్యంగా రంగంలోకి దిగిన ఈ కేసులోని నిందితుడు ధీరావత్ రాజు ‘భద్రమ్’ సినిమాను తన ప్లాన్‌కు ఎంచుకున్నాడు. ఇంటర్ ఫెయిల్ అయిన రాజు డబ్బు కోసం ఏకంగా ఐదుగురి ప్రాణాలను బలితీసుకున్నాడు. క్రైమ్ సీరియళ్లు, సినిమాలు చూసి నేరాలు చేయడంలో రాజు ఆరితేరాడు. వ్యాధులతో రేపో, మాపో చనిపోయే వారిని గుర్తించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పేరున బీమా చేయించేవాడు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా వారిని చంపేసి ప్రమాదంలో మరణించినట్టు నమ్మించి బీమా క్లెయిమ్ చేసేవాడు. వచ్చే డబ్బుల్లో మెజారిటీ వాటాను అతడు నొక్కేసి మిగతాది బాధిత కుటుంబ సభ్యులకు ఇచ్చేవాడు.

2013లో సూర్యాపేట జిల్లాలోని శూన్యపహాడ్‌కు చెందిన సపావత్ సక్రియా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి రాజు సమీప బంధువే కావడంతో బాధిత కుటుంబాన్ని రాజు సంప్రదించాడు. సక్రియా బతికే ఉన్నట్టుగా పత్రాలు సృష్టించి రూ. 1.4 లక్షలకు బీమా చేయించాడు. ఆ తర్వాత అతడు చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ తీసుకుని బీమా క్లెయిమ్ చేశాడు. ఇది సక్సెస్ కావడంతో ఆ తర్వాత చెలరేగిపోయాడు.

అయితే, తొలి పథకం సక్సెస్ అయినా ఆ తర్వాత ఎలా ముందుకెళ్లాలో తెలియని రాజు దాదాపు 10 నెలలపాటు ఖాళీగా ఉన్నాడు. ఈ సమయంలో 2014లో విడుదలైన ‘భద్రమ్’ సినిమా చూశాడు. యాక్సిడెంట్‌ పాలసీ చేయించి, అమాయకులను చంపి, రోడ్డు ప్రమాదాలుగా చిత్రించి, బీమా డబ్బులను క్లెయిమ్‌ చేసుకునే రాకెట్‌ నేపథ్యంతో సాగే కథ ఇది. ఈ సినిమాను ప్రేరణగా తీసుకున్న రాజు తన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడం మొదలుపెట్టాడు. రేపో, మాపో చనిపోయేవారిని గుర్తించి వారి కుటుంబ సభ్యులను సంప్రదించేవాడు. వారిపై బీమా చేయించేవాడు. ఆపై వారిని చంపేసి, ప్రమాదంగా చిత్రీకరించి బీమా క్లెయిమ్ చేసేవాడు. వచ్చిన సొమ్మును నామినీతో కలిసి వచ్చిన సొమ్మును పంచుకునేవాడు.

కాగా, ఈ కేసు దర్యాప్తు జరుపుతుండగానే నాగార్జున సాగర్‌లో ఆరేళ్ల క్రితం జరిగిన ఇలాంటి ఘటనే మరొకటి వెలుగుచూసింది. మామ పేరిట మూడు భారీ వాహనాలు కొనుగోలు చేయించిన అల్లుడు వాటికి బీమా చేయించాడు. ఆ తర్వాత మామకు కూడా ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. ఓ బ్యాంకులో మామకు ఖాతా తెరిపించాడు. ఈ బ్యాంకులో ఖాతాదారులకు యాక్సిడెంటల్ పాలసీ ఉంది. అన్నీ ప్లాన్ ప్రకారం జరిగిన తర్వాత మామను చంపేసి ప్రమాదంగా చిత్రీకరించాడు. అతడు చనిపోవడంతో వాహనాల నెల వాయిదాలు రద్దయ్యాయి. బ్యాంకు నుంచి బీమా సొమ్ము అందింది. ఇలా ఐదు పాలసీల నుంచి నిందితుడైన అల్లుడు లబ్ధి పొందిన విషయం తెలిసి పోలీసులు విస్తుపోయారు.

2017లో నిందితుడు రాజు ఏపీలోని ప్రకాశం జిల్లాలోనూ, గుంటూరు జిల్లాలోని దాచేపల్లిలోనూ ఇలాంటి ప్రయత్నమే చేసి విఫలమై పోలీసులకు చిక్కి రెండేళ్లపాటు జైలు శిక్ష అనుభవించాడు. దీంతో ముందే ఒప్పందం చేసుకున్న కోటిరెడ్డిని హత్య చేసే విషయంలో ఆలస్యమైంది. కోటి రెడ్డి పేరిట రూ. 1.20 కోట్లు వచ్చే బీమాలు తీసుకున్నాడు. చివరికి ఇటీవల అతడిని హత్య చేసి మళ్లీ దొరికిపోయాడు.