covid 19 vaccine: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక చిన్న ఆసుపత్రుల్లోనూ కరోనా టీకా

కరోనా వ్యాక్సిన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ పంపిణీని ప్రజలకు మరింత చేరువ చేయనుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలోని 225 ఆసుపత్రులు(ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా, బోధనాసుపత్రులు).. ప్రైవేటులో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు అనుసంధానంగా ఉన్న 179 ఆసుపత్రుల్లో కొవిడ్‌ టీకాలను ఇస్తుండగా.. వీటి పరిధిని మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

covid 19 vaccine: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక చిన్న ఆసుపత్రుల్లోనూ కరోనా టీకా

Covid 19 Vaccine

telangana government key decision on covid 19 vaccine: కరోనా వ్యాక్సిన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ పంపిణీని ప్రజలకు మరింత చేరువ చేయనుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలోని 225 ఆసుపత్రులు(ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా, బోధనాసుపత్రులు).. ప్రైవేటులో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు అనుసంధానంగా ఉన్న 179 ఆసుపత్రుల్లో కొవిడ్‌ టీకాలను ఇస్తుండగా.. వీటి పరిధిని మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోగ్యశ్రీ ట్రస్టుకు అనుసంధానంతో సంబంధం లేకుండా.. కనీసం 20 బెడ్ లున్న ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తోంది.

ఈ తరహాలో రాష్ట్రవ్యాప్తంగా మరో వెయ్యి వరకూ ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. తద్వారా మండలాల్లోని నర్సింగ్‌ హోంలు, చిన్న ఆసుపత్రుల్లోనూ కొవిడ్‌ టీకాలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన ప్రైవేటు హాస్పిటల్స్ లిస్టును ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ సిద్ధం చేసింది. ఈ విషయంపై సోమవారం(మార్చి 15,2021) ఉన్నతస్థాయిలో సమీక్షించారు. ఇప్పటికే 100కి పైగా ఆసుపత్రులు.. పంపిణీకి అనుమతించాలని దరఖాస్తు చేసినట్లు వైద్య వర్గాలు తెలిపాయి.

ప్రైవేట్ ఆసుపత్రుల వైపే మొగ్గు:
రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే 60 ఏళ్లు పైబడినవారు లక్షా 64వేల 484 మంది.. 45-59 ఏళ్ల కేటగిరీలో 53వేల 921 మంది తొలిడోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ రెండు కేటగిరీల్లోనూ ప్రభుత్వ వైద్యంతో పోల్చితే.. ప్రైవేటులో అధికంగా వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రైవేటులో వ్యాక్సిన్ పొందితే.. ఒక్కో డోసుకు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. పంపిణీ కేంద్రాల సంఖ్య ప్రైవేటులో తక్కువగా ఉన్నా.. రుసుము చెల్లించాల్సి వచ్చినా వాటిల్లో టీకాలను పొందడానికి ముందుకు వస్తున్న వారి సంఖ్య దాదాపు 40 శాతానికి పైగా అధికంగా ఉంది. ఈ పరిణామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ప్రైవేటు ఆసుపత్రుల సంఖ్యను పెంచాలని నిర్ణయించినట్లుగా వైద్యవర్గాలు తెలిపాయి.

ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు:
చిన్న ఆసుపత్రుల్లో టీకాలను అందించినా.. దుష్ఫలితాల చికిత్సలపై ఇప్పుడు కొనసాగిస్తున్న విధానాలనే అనుసరించనున్నారు. 3 గదుల విధానాన్ని, టీకా పొందిన తర్వాత 30 నిమిషాల పాటు వేచి చూడడం.. ఏమాత్రం అస్వస్థతగా అనిపించినా వెంటనే ట్రీట్మెంట్ అందించడం వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆసుపత్రులకు వైద్యవర్గాలు ఆదేశాలు ఇవ్వనున్నాయి. ఒకవేళ తీవ్ర దుష్ఫలితాలు ఎదురైనా వెంటనే తరలించేందుకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 60కి పైగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.