సిక్కోలుపై ఫొని ఎఫెక్ట్ : సెలవులు రద్దు..

పొని తుఫాన్ దూసుకొస్తోంది. మే 3వ తేదీన తుఫాన్ తీరం దాటే సమయంలో ఆయా జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతాయని వెల్లడించింది. దీనితో అధికారులు అలర్ట్ అయ్యారు. సహాయక చర్యల ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. శ్రీకాకుళంలో అధికారులను కలెక్టర్ నివాస్ అప్రమత్తం చేశారు. తుఫాన్ తీరం దాటి.. అంతటా ప్రశాంతత నెలకొనేవరకూ అధికారులకు సెలవులు రద్దు చేశారు. ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం అధికారులతో పరిస్థితిపై సమీక్షించారు.
Also Read : ఫోని తుఫాన్ : ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
తూర్పుగోదావరి జిల్లాలోని తీరప్రాంత మండలాలలో ముందస్తు చర్యలు చేపట్టారు. మే 01వ తేదీ బుధవారం సాయంత్రానికి 36 సహాయక బృందాలు ఇక్కడకు చేరుకొంటాయి. తుఫాను పరిస్థితి పర్యవేక్షణ కోసం 14 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. 150 జేసీబీలు, 200 జనరేటర్లు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ కార్తికేయమిశ్రా తెలిపారు.
ప్రతి తుఫాన్ స్థాయిని దాని తీవ్రతను బట్టి వాతావరణ శాఖ నిర్ధారిస్తుంది. తుఫాన్..తీవ్ర తుఫాన్…అతి తీవ్ర తుఫాన్..పెను తుఫాన్..ప్రచండ తుఫాన్. 2014లో హుద్‌హుద్ తుఫాన్ సంభవించినప్పుడు అతి తీవ్ర తుఫానా..? ప్రచండ తుఫానా..? అన్న తర్జనభర్జన జరిగింది. దాంతో వాతావరణ శాఖ 2015లో తొలిసారిగా పెను తుఫాన్ (ఎక్ట్రీమ్లీ వెరీ సివియర్ సైక్లోన్) అన్న కేటగిరీని ఏర్పాటు చేసింది. ఈ కేటగిరీ విభజన జరిగిన తరువాత తొలిసారిగా ఏర్పడిన తుఫానే ఫోని. ఇది తీరం దాటే సమయంలో 185-195, ఒక్కోసారి 205 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి.
Also Read : పెను తుఫాన్ గా ఫోని : తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల వేగంతో గాలులు