ఇమ్రాన్ ఖాన్ కు షాక్ : ప్రధాని మోడీకి మద్దతు తెలిపిన పాక్ నేత

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370, 35ఏ రద్దును సమర్థిస్తున్నామని పాకిస్థాన్ కు చెందిన ముత్తాహిదా కౌమి మూవ్ మెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆల్తారీ హుస్సేన్ అన్నారు. కశ్మీర్ విషయం భారత అంతర్గత వ్యవహారమని చెప్పారు.

  • Published By: veegamteam ,Published On : September 1, 2019 / 02:41 PM IST
ఇమ్రాన్ ఖాన్ కు షాక్ : ప్రధాని మోడీకి మద్దతు తెలిపిన పాక్ నేత

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370, 35ఏ రద్దును సమర్థిస్తున్నామని పాకిస్థాన్ కు చెందిన ముత్తాహిదా కౌమి మూవ్ మెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆల్తారీ హుస్సేన్ అన్నారు. కశ్మీర్ విషయం భారత అంతర్గత వ్యవహారమని చెప్పారు.

జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370, కశ్మీరి పౌరసత్వానికి సంబంధించి ఉద్ధేశించిన 35ఏ భారత ప్రభుత్వం రద్దు చేయడాన్ని సమర్థిస్తున్నామని పాకిస్థాన్ కు చెందిన ముత్తాహిదా కౌమి మూవ్ మెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆల్తారీ హుస్సేన్ అన్నారు. ఈ విషయంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కశ్మీర్ విషయం భారత అంతర్గత వ్యవహారమని చెప్పారు. జమ్మూ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని అన్నారు. రాజకీయ అవసరాల కోసం పాక్ ప్రధాని ఆర్మీని వాడుకుంటున్నారని విమర్శించారు. ఇమ్రాన్ వైఖరి మార్చుకోకపోతే అంతర్జాతీయంగా పాక్ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు హుస్సేన్. 

ఆదివారం (సెప్టెంబర్ 1, 2019)వ తేదీన హుస్సేన్ తన మద్దతుదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సారే జహాసే అచ్చా గేయాన్ని ఆలపించడం విశేషం.

Also Read : భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కత్తితో పొడిచి చంపాడు