అతిలోక సుందరి : శ్రీదేవి మైనపు విగ్రహం ఆవిష్కరణ

  • Published By: madhu ,Published On : September 4, 2019 / 08:23 AM IST
అతిలోక సుందరి : శ్రీదేవి మైనపు విగ్రహం ఆవిష్కరణ

అతిలోక సుందరిగా ఇటు దక్షిణాది ప్రేక్షకులతో పాటు ఉత్తరాది ప్రేక్షకులను అలరించారు దివంగత నటి శ్రీదేవి. ఆమె లేని లోటు తీర్చలేనిది..పూడ్చలేనిది. అయితే..అచ్చం శ్రీదేవిని పోలిన మైనపు విగ్రహాన్ని చూసి ఆమె ఫాన్స్, కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి మైనపు విగ్రహం సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించారు.

1987లో శ్రీదేవి నటించిన సూపర్ హిట్ చిత్రం మిస్టర్ ఇండియాలోని హవా హవాయి లుక్ ఆధారంగా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఈ విగ్రహం ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకొంటోంది. శ్రీదేవిని నిజంగా చూస్తున్న ఫీలింగ్ కనబడుతోంది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో బోనీ కపూర్, ఖుషీ, జాన్వీ, శ్రీదేవి సోదరి మహేశ్వరీ ఇతరులు పాల్గొన్నారు. 

ప్రముఖులు మైనపు విగ్రహాలను రూపొందించి వాటికి సజీవ రూపం ఇస్తోంది మేడం టుస్సాడ్స్. శ్రీదేవి మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ ఇటీలే ప్రకటించింది. బాలీవుడ్ నుంచి అమితాబ్, హృతిక్, మాధురి దీక్షిత్, ఐశ్వర్య రాయ్, మహేష్, ప్రభాస్‌తో పాటు ఇతర నటుల మైనపు విగ్రహాలను ఏర్పటు చేశారు. బోనీకపూర్ సోదరి రీనా కుమారుడు మోహిత్ మౌర్యా పెళ్లికని దుబాయి‌కి వెళ్లిన శ్రీదేవి 2018, ఫిబ్రవరి 24వ తేదీన..అక్కడ ఓ హోటల్ గదిలో ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో పడి చనిపోయిన సంగతి తెలిసిందే. 
Read More : బాక్సాఫీస్ రికార్డ్ : సాహో కలెక్షన్స్ రూ. 350 కోట్లు
బాలనటిగా కెరీర్ మొదలుపెట్టిన శ్రీదేవి..ఎన్నో విజయంతమైన చిత్రాల్లో నటించారు. దక్షిణాదిన నటించిన సినిమాలు ఎన్నో సూపర్ హిట్ అయ్యాయి. హిందీ చిత్ర సీమలో కూడా సక్సెస్ ఫుల్‌ నటిగా రాణించింది. నిర్మాత బోనీకపూర్‌ను పెళ్లాడిన శ్రీదేవి..పిల్లలు పుట్టిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే..చాలాకాలం తర్వాత మళ్ల మేకప్ వేసుకున్నారామె. ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె చివరిగా నటించిన మూవీ మామ్.