బాక్సాఫీస్ రికార్డ్ : సాహో కలెక్షన్స్ రూ. 350 కోట్లు

  • Published By: vamsi ,Published On : September 4, 2019 / 05:46 AM IST
బాక్సాఫీస్ రికార్డ్ : సాహో కలెక్షన్స్ రూ. 350 కోట్లు

సాహో.. టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం దుమ్మురేపుతున్నాయి. 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా.. అదే రేంజ్ లో వసూళ్లను రాబడుతోంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల రూపాయలను రాబట్టి.. రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం ఐదు రోజుల్లోనే ఈ కలెక్షన్స్ రావటం విశేషం.

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ తగ్గినా.. ఉత్తర భారత దేశంలో మాత్రం ఊహించని విధంగా కలెక్షన్స్ రాబడుతోంది సాహో మూవీ. కొన్ని ధియేటర్లలో ఇప్పటికీ మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఐదు రోజుల్లోనే సాహో మూవీ ప్రాఫిజ్ జోన్ లోకి వచ్చింది అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఆఫ్ ద ఇయర్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది యూవీ క్రియేషన్స్.

సాహో మరో బ్రేకింగ్ ఏంటంటే.. హిందీ వెర్షన్ 100 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సెప్టెంబర్ 3వ తేదీ 50శాతం కలెక్షన్స్ తగ్గినా.. 8 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. టోటల్ గా ఇప్పటి వరకు కేవలం హిందీ వెర్షన్ లోనే 102 కోట్లు రాబట్టింది. అది కూడా 5 రోజుల్లోనే కావటం.. అది కూడా బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమానే కావటం మరో రికార్డ్.