Sangareddy : మారణాయుధాలతో తిరుగుతున్నవ్యక్తి అరెస్ట్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో నాటు తుపాకీ, మారణాయుధాలతో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని జహీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Sangareddy : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో నాటు తుపాకీ, మారణాయుధాలతో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని జహీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జహీరాబాద్ శివారులోని బీదర్ చౌరస్తాలో నాటు తుపాకీతో సహా రెండు కత్తులతో ఒక వ్యక్తి సంచరిస్తుండగా జహీరాబాద్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ శ్రీకాంత్ పట్టుకున్నారు.
నిందితుడు కర్ణాటకలోని కల్బుర్గి జిల్లా చించోలి తాలూకా మగ్గంపూర్ గ్రామానికి చెందిన జుబేర్(22) గా పోలీసులు గుర్తించారు. నిందితుడు తుపాకీతో ఎందుకు సంచరిస్తున్నాడు …..ఇంకా ఇతని వెనుక ఎవరైనా ముఠా సభ్యులు ఉన్నారా ? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.