ఫస్ట్ నామినేషన్ లోనే ఎలిమినేషన్: అలీ రెజా అవుట్!

  • Published By: vamsi ,Published On : September 7, 2019 / 02:37 PM IST
ఫస్ట్ నామినేషన్ లోనే ఎలిమినేషన్: అలీ రెజా అవుట్!

సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే బిగ్ బాస్ షో చాలా ఇంట్రస్టింగ్ గా సాగుతుంది. కొన్ని కోపాలు.. మరికొన్ని నవ్వులు.. అలకలు.. అరుపులు.. మరో వైపు టాస్కులు.. వారానికి ఓ ఎలిమినేషన్.. బిగ్ బాస్ షో తీరు ఇది. ప్రతీవారం మాదిరిగానే ఈ వారం బిగ్ బాస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కాక తప్పట్లేదు.

తొలి వారం ఎలిమినేషన్‌లో హేమ, రెండో వారం జాఫర్, మూడో వారంలో తమన్నా ఎలిమినేట్ కాగా.. నాలుగో వారం రోహిణీ ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఐదవ వారం కూడా ఒకరు ఎలిమినేట్ అవుతారని అందరూ ఊహించారు. అనూహ్యంగా 5వ వారం మాత్రం ఎవరూ ఎలిమినేట్ కాలేదు.

అయితే ఆరవ వారం మాత్రం అంటే ఈ వారం ముందుగా తెలిసిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ హౌస్ నుంచి అలీ రెజా ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది.  ఈ వారం మాత్రం అందరూ బలమైన కంటెస్టెంట్లు ఉండగా ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో రాహుల్ ఎలిమినేట్ అవుతారని ఫస్ట్ నుంచి అందరూ భావించారు.

ఈ వారం నామినేషన్స్ కు రాహుల్, రవి, శ్రీముఖి, అలీరెజా, మహేష్ సెలెక్ట్ అవ్వగా..  చివరకు అలీ రెజా ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది. అలీ రెజా ఫస్ట్ టైమ్ ఎలిమినేషన్ నామినేషన్ లోకి రాగా.. ఫస్ట్ నామినేషన్ లోనే అలీ బయటకు వచ్చేసినట్లు తెలుస్తుంది.

టాస్క్‌లు బాగానే ఆడుతున్నప్పటికీ, తనకున్న టెంపర్‌, అగ్రెసివ్‌నెస్‌ కారణంగానే అలీ రెజాకు ఓట్లు తక్కువగా పడినట్లు తెలుస్తుంది. ఫస్ట్ సీజన్ లో కూడా ప్రిన్స్ నామినేషన్ కు వచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ ఎలిమినేట్ అయ్యారు.