‘వేట నేర్పుతా రారా అల్లుడు’ : వెంకీమామ ఫస్ట్ గ్లింప్స్

దసరా పండుగ సందర్భంగా విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్య మామా అల్లుళ్లుగా నటిస్తున్న ‘వెంకీమామ’.. ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : October 8, 2019 / 05:59 AM IST
‘వేట నేర్పుతా రారా అల్లుడు’ : వెంకీమామ ఫస్ట్ గ్లింప్స్

దసరా పండుగ సందర్భంగా విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్య మామా అల్లుళ్లుగా నటిస్తున్న ‘వెంకీమామ’.. ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్..

విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్య, పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా మెయిన్ లీడ్స్‌గా నటిస్తున్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్.. ‘వెంకీమామ’.. కేఎస్ రవీంద్ర (బాబీ) డైరెక్ట్ చేస్తుండగా.. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేసిన న్యూ పోస్టర్ ఆకట్టుకుంటుంది. రీసెంట్‌గా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. వెంకీ, చైతు రిలేషన్ రివీల్ చేశారు ఈ వీడియోలో.. ‘గోదావరిలో ఈత నేర్పా, బరిలో ఆట నేర్పా, ఇప్పుడు జాతరలో వేట నేర్పిస్తా.. రారా అల్లుడు’.. అంటూ వెంకీ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.

Read Also : ‘జీనా హై తో మర్నా సీఖో’ : జార్జ్ రెడ్డి – ట్రైలర్..

ఫస్ట్ గ్లింప్స్ చూసి అక్కినేని, దగ్గుబాటి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో పాట చిత్రీకరిస్తున్నారు. సంగీతం : థమన్, కెమెరా : ప్రసాద్ మూరెళ్ల, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, నిర్మాతలు : సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్.