Rahul Gandhi – Virat Kohli: విరాట్ కోహ్లీకి సపోర్ట్ చేస్తున్న రాహుల్ గాంధీ

ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సపోర్ట్ గా నిలిచారు కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ. ట్రోలింగ్ చేసే వారిని ఉద్దేశించి చెప్తూ టీంను కాపాడుకోవాలని సూచించారు.

Rahul Gandhi – Virat Kohli: విరాట్ కోహ్లీకి సపోర్ట్ చేస్తున్న రాహుల్ గాంధీ

Virat Rahul

Rahul Gandhi – Virat Kohli: టీ20 వరల్డ్ కప్ టోర్నీ 2021లో భాగంగా భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా వరుస పరాజయాలు చవిచూసింది. అక్టోబర్ 24న పాకిస్తాన్‌తో, అక్టోబర్ 31న న్యూజిలాండ్ తో 10వికెట్లు, 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా సెమీస్ చేరుకునే అవకాశాలు దాదాపు చేజార్చుకున్నట్లు అయింది. వరల్డ్ కప్ చేజార్చుకుంటున్నాడనే క్రమంలో కోహ్లీపైనా, అతని ఫ్యామిలీపైనా ట్రోలింగ్స్ ఎక్కువయ్యాయి.

ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సపోర్ట్ గా నిలిచారు కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ. ట్రోలింగ్ చేసే వారిని ఉద్దేశించి చెప్తూ టీంను కాపాడుకోవాలని సూచించారు.
‘ప్రియమైన విరాట, వీళ్ల మనసుల నిండా ద్వేష భావం నిండిపోయింది. ఎందుకంటే వీరికి ఎవ్వరూ ప్రేమను పంచివ్వలేదు. వాళ్లని క్షమించు. నీ టీంను కాపాడుకో’ అంటూ ట్విట్టర్ వేదికగా సూచనలిచ్చారు.

 

మరో ప్లేయర్ షమీపై మతపరంగా ట్రోలింగ్ చేసిన వారిని తిట్టిపోస్తూ కోహ్లీ ఘాటుగా రెస్పాండ్ అయ్యాడు. మీడియా కాన్ఫిరెన్స్ లో మాట్లాడిన కోహ్లీ వెన్నెముక లేని వెధవలే ఇటువంటి కామెంట్లు చేస్తారని తిట్టిపోశాడు. ఓ స్టార్ ప్లేయర్‌ను మతం పేరిట దూషించడం అమానుషమని, ఇలాంటి పిచ్చి కూతలకు సోషల్ మీడియా వేదిక కావడం బాధాకరంగా ఉందన్నాడు కోహ్లీ. మహమ్మద్ షమీకి జట్టు మొత్తం అండగా ఉందని, తదుపరి మ్యాచ్‌లో 200 పర్సెంట్ ఆడతాడని వెనకేసుకొచ్చాడు.

………………………………………. : వ్యాక్సిన్ తీసుకున్నాక కరోనా యాంటీబాడీలు ఎవరిలో ఎక్కువగా డెవలప్ అవుతున్నాయి..?

విశ్లేషకులు, విమర్శకులు టీమిండియా అభిమానులు టోర్నీలో ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్ లపై విమర్శిస్తూనే ఉన్నారు. జట్టులో ప్లేయర్ల ప్రదర్శన, కోచ్ రవిశాస్త్రి కనిపించకపోవడంపై పలు ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి.