Indian 2: కాజల్ స్థానంలో త్రిష.. ప్రెగ్నెన్సీయే కారణమని టాక్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నుండి కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లు భార్యగా గత ఏడాది ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే మొదటి వివాహ వార్షికోత్సవం జరుపుకొన్న ఈ జంటకి త్వరలోనే..

Indian 2: కాజల్ స్థానంలో త్రిష.. ప్రెగ్నెన్సీయే కారణమని టాక్!

Indian 2

Indian 2: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నుండి కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లు భార్యగా గత ఏడాది ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే మొదటి వివాహ వార్షికోత్సవం జరుపుకొన్న ఈ జంటకి త్వరలోనే ప్రమోషన్ ఖాయమని, కాజల్ ప్రస్తుతం గర్భవతి అని సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. మాతృత్వం ఓ అద్భుతమైన అనుభూతి అని.. తాను కూడా ఆ అనుభూతి కోసం ఎదురుచూస్తున్నానని చెప్పిన కాజల్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనే వార్తలు నిజం కాదని వివరణ ఇచ్చుకుంది. అయితే పుకార్లు మాత్రం ఆగడం లేదు.

Padutha Theeyaga: వారసుడి చేతుల్లోకి బాలు మానస పుత్రిక!

కాజల్ చేతిలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులలో సౌత్ స్టార్ దర్శకుడు శంకర్-విలక్షణ నటుడు కమల్ హాసన్ ల ఇండియన్ 2 కూడా ఒకటి. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తికావాల్సి ఉండగా కరోనా రావడం.. ఆ తర్వాత మేకర్స్ మధ్య వివాదాలు, కోర్టుల వరకు వెళ్లడంతో ఈ సినిమా మరుగున పడింది. ఈలోగా శంకర్ రామ్ చరణ్ తో సినిమాని టేకప్ చేశాడు. కాగా, ఇప్పుడు ఇండియన్ 2 వివాదం ముగియగా మేకర్స్ ఓ సయోధ్యకి వచ్చారు. మళ్ళీ ఇండియన్ 2 షూటింగ్ పునఃప్రారంభం కానుంది.

#NTR30: కొరటాల కథ కోసం ముగ్గురు హేమాహేమీ రచయితలు!

అయితే, చరణ్ సినిమా తర్వాతే శంకర్ ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లే ఒప్పందడం చేసుకున్నట్లు తెలుస్తుండగా వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత ఇది పట్టాలెక్కనుంది. అయితే, ఇందులో కాజల్ స్థానంలో త్రిషను ఎంపిక చేసినట్లు పుకార్లు మొదలయ్యాయి. కాజల్ ప్రెగ్నెన్సీ కావడంతోనే త్రిషను లాక్ చేశారని తమిళ ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. అయితే, ఇది అంతా సులభం కాదు.. ఎందుకంటే ఇప్పటికే కాజల్ మీద కొన్ని సీన్ల షూటింగ్ కూడా జరిగింది. అసలే భారీ ప్రాజెక్ట్ కాగా మళ్ళీ ఆ సీన్స్ రీషూట్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయితే, మేకర్స్ సమాధానంతో పనిలేకుండా పుకార్లు మాత్రం ఆగడం లేదు.