Kondapalli : హైకోర్టు తీర్పు మీదే ఆధారపడ్డ కొండపల్లి చైర్మన్ ఎన్నిక..!

కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. చేయి ఎత్తి చైర్మన్ ఎన్నికను నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి చెన్నుబోయిన చిట్టిబాబుకు టీడీపీ కౌన్సిలర్లు మద్దతు తెలిపారు.

Kondapalli : హైకోర్టు తీర్పు మీదే ఆధారపడ్డ కొండపల్లి చైర్మన్ ఎన్నిక..!

Kondapally (1)

Kondapalli Municipal election : కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. చేయి ఎత్తి చైర్మన్ ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి చెన్నుబోయిన చిట్టిబాబుకు టీడీపీ కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. వైసీపీ అభ్యర్థి జోగి రాముకు వైసీపీ కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. టీడీపీ వైస్ చైర్ చైర్మన్ అభ్యర్థులు లక్ష్మీ, శ్రీనివాస్ కు టీడీపీ కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. ఎక్స్ అఫిషీయో సభ్యులుగా ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వసంత ఓటు హక్కు వినియోగించుకున్నారు.

తుది ఫలితాన్ని హైకోర్టుకు ఎన్నికల అధికారులు నివేదించనున్నారు. ఎంపీ కేశినేని నాని ఓటును పరిగణనలోకి తీసుకోవాలా..? వద్దా..? అనే అంశంపై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. కొండపల్లి చైర్ చైర్మన్ సీటు వ్యవహరం హైకోర్టు తీర్పు మీద ఆధారపడినట్లు తెలుస్తోంది. ఎన్నిక ప్రక్రియ మొత్తాన్ని అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు.

CM Jagan Letter : ‘వరద సాయంగా రూ.1000 కోట్లు ఇవ్వండి’..మోదీ, అమిత్‌షాకు సీఎం జగన్ లేఖలు

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో మొదటి వార్డు నుండి వరుసగా ఒక్కొక్క సభ్యునితో ఎన్నికల అధికారులు ప్రమాణ స్వీకారం చేయుంచారు. చైర్మన్ ఎన్నిక జరుగుతోంది. చైర్మన్ ఎన్నికలో ఎంపీ నానితో కలిపి 16 మంది టిడిపి సభ్యులు చేయి ఎత్తి ఓటు వేశారు. చైర్మన్ గా చేన్నుబోయిన చిట్టిబాబు(25 వ వార్డు సభ్యులు)కి తమ మద్దతు తెలిపి, అతడు చైర్మన్ గా 16 మంది సభ్యులు అంగీకారాన్ని తెలిపినట్లుగా తెలుస్తోంది.

వైస్ చైర్మన్ ఎన్నిక ప్రారంభమైంది. 29వ వార్డు కౌన్సిలర్ చుట్టుకుదురు శ్రీనివాస్,10 వ వార్డు టీడీపీ సభ్యులు కరిమికొండ శ్రీలక్ష్మిలను వైస్ చైర్మన్ లకు సభ్యులంతా ఆమోదం తెలిపారని సమాచారం. ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. చైర్మన్, వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించిన సమాచారాన్ని సీల్డ్ కవర్ లో మున్సిపల్ ఎన్నికల సిబ్బంది హైకోర్టుకు అందజేయనుంది.