Cobra Movie : విక్రమ్ ‘కోబ్రా’ పరిస్థితి ఏంటి?
వెర్సటైల్ యాక్టర్ ‘చియాన్’ విక్రమ్ పలు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్న ‘కోబ్రా’ మూవీ న్యూ అప్డేట్..
Cobra Movie: ‘చియాన్’ విక్రమ్.. ఎంత కష్టమైనా సరే.. సినిమా కోసం పోషించే పాత్ర కోసం హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా తననితాను మలుచుకుంటారు. ‘అపరిచితుడు’, ‘ఐ’, ‘ఇంకొక్కడు’ ఇలా తన కెరీర్లో ఎన్నో గుర్తుండిపోయే క్యారెక్టర్స్‌తో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేశారు.
Pushpa Movie : సుకుమార్ కోసం మేకప్‌మెన్‌గా మారిన అల్లు అర్జున్!
ఇప్పడాయన ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో నటిస్తున్న మూవీ ‘కోబ్రా’.. ‘కె.జి.యఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్. విక్రమ్ లుక్స్‌కి, టీజర్‌కి మంచి రెస్సాన్స్ వచ్చింది. పలు గెటప్స్‌లో కనిపించి సర్ప్రైజ్ చేశారు. టీజర్ చూశాక తెరమీద ఆయణ్ణి ఎలాంటి డిఫరెంట్ రోల్స్‌లో చూడబోతున్నాం అనే ఎగ్జైట్మెంట్ అందరిలోనూ నెలకొంది. టీజర్లో తన మేధాశక్తితో మేథమెటిక్స్‌తో ఎలాంటి సమస్యనైనా సాల్వ్ చేసే జీనియస్‌గా విక్రమ్‌ని చూపించారు. ప్రతి గెటప్ దాని తాలుకు బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకున్నాయి.
Chiyaan Vikram : విలన్‌గా విక్రమ్!..
విక్రమ్ ప్రస్తుతం ‘ధృవనక్షత్రం’, ‘మహాన్’, ‘పొన్నియిన్ సెల్వన్ – పార్ట్ 1’, ‘మహావీర్ కర్ణ’ సినిమాలు చేస్తున్నారు. కొన్నాళ్లుగా ‘కోబ్రా’ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ఈ సినిమా పరిస్థితి ఏంటబ్బా అనే డౌట్ ఎక్స్‌ప్రెస్ చేసారు ఫ్యాన్స్. దీంతో టీం ‘కోబ్రా’ ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేసామని.. సినిమా చాలా బాగా వచ్చిందని.. 2022 వేసవిలో విడుదల చేస్తామని అప్డేట్ ఇచ్చారు.
Kartikeya Wedding : ‘పెద్దయ్యాక హీరో అవుతా.. అప్పుడు నా పెళ్లికి చిరంజీవి వస్తాడు’