Ind vs Nz : రెండో టెస్టు జరిగేనా ? సిరీస్ దక్కేనా

రెండో టెస్టులో గెలవడంతో పాటు..సిరీస్ ను కైవసం చేసుకోవాలని టీమిండియా తహతహలాడుతోంది.

Ind vs Nz : రెండో టెస్టు జరిగేనా ? సిరీస్ దక్కేనా

Team India

India Vs New Zealand 2nd Test : రెండో టెస్టులో గెలవడంతో పాటు..సిరీస్ ను కైవసం చేసుకోవాలని టీమిండియా తహతహలాడుతోంది. వాంఖెడే మైదానంలో న్యూజిలాండ్ – భారత్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగనుంది. మొదటి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఎలాగైనా విజయం సాధించాలని భారత క్రీడాకారులు సన్నద్ధమయ్యారు. తొలి టెస్టు మ్యాచ్ కు దూరంగా ఉన్న కోహ్లీ..ఈ మ్యాచ్ కు అందుబాటులోకి రావడంతో..టీమిండియా బలం మరింత రెట్టింపైంది. కివీస్ కూడా తాము తక్కువ తినడం లేదని అంటోంది. ఆత్మవిశ్వాసంతో సమరానికి సై అంటోంది. అయితే..వాతావరణం ఏ మేర అనకూలిస్తుందోనన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ముంబైలో గురువారం వర్షం కురిసింది. దీంతో శుక్రవారం వాతావరణం ఎలా ఉంటుందోనే టెన్షన్ నెలకొంది.

Read More : UP Elections: 20లక్షల జాబ్‌లు కల్పిస్తాం.. కాంగ్రెస్ అజెండా డెవలప్మెంట్ మాత్రమే

మరోవైపు..టెస్టు మ్యాచ్ కోసం..ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై కోహ్లీకి సవాల్ గా మారింది. ఫామ్ లో లేని రహానే, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ లో ఒకరిపై వేటు పడడం ఖాయంగా కనిపిస్తోంది. సీనియర్ గా ఉన్న రహానే..సొంత గడ్డపై చెలరేగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు సమాచారం. అంతగా రాణించలేకుండా ఉన్న ఇషాంత్ స్థానంలో సిరాజ్ ను తుది జట్టులోకి తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాహా ఫిట్ గా ఉండడం టీమిండియాకు కలిసివస్తోంది. ముగ్గురు స్పిన్నర్లు అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ లు రాణిస్తే..బాగుంటుందని అనుకుంటున్నారు.

Read More : Jubilee Hills : మేనల్లుడితో అత్త వివాహేతర సంబంధం..అనంతరం బ్లాక్ మెయిల్

మరోవైపు..న్యూజిలాండ్ చాలా ఉత్సాహంగా..రెండో టెస్టు బరిలో దిగడానికి సిద్ధమైంది. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓపెనర్ లేథమ్, కెప్టెన్ విలియమ్సన్, రాస్ టేలర్ లు బ్యాట్ ఝులిపించాలని ఆ జట్టు కొరుకొంటోంది. ఆఫ్ స్పిన్నర్ సోమర్ విలేను పక్కకు తప్పించి…పేసర్ నీల్ వాగ్మర్ ను తీసుకొనే అవకాశాలున్నాయి.

Read More : Bollywood New Films: కొత్తగా కనిపిస్తున్న బాలీవుడ్.. అన్నీ ఇంటెన్స్ డ్రామాలే

తుది జట్లు అంచనా : భారత్ – శుభ్ మన్ గిల్, మయాంక్ అగర్వాల్, పుజారా, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సాహా, రవీంద్ర జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, సిరాజ్, ఉమేశ్ యాదవ్.

న్యూజిలాండ్ –
విల్ యంగ్, లేథమ్, విలియమ్సన్, రాస్ టేలర్, నికోల్స్, బ్లండెల్, రచిన్ రవీంద్ర, జేమీసన్, సౌథీ, వాగ్నర్, అజాజ్ పటేల్.