Malavika : పంజాబ్ ఎన్నికల్లో సోనూసూద్ సోదరి.. స్టేట్ అఫ్ ఐకాన్ బాధ్యత నుంచి తప్పుకున్న సోనూసూద్
పంజాబ్ ఎన్నికల్లో ఈ సారి సోనూసూద్ సోదరి మాళవిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. దీంతో తన సోదరి ఎన్నికల్లో పోటీ చేస్తుండటం కారణంగా సోనూసూద్ ఓ కీలక భాద్యత నుంచి తప్పుకున్నారు.
SonuSood : దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికలు త్వరలో నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఇవాళ ఈ ఎన్నికలపై కీలక ప్రకటన చేయనుంది. దీంతో ఇప్పటికే పార్టీలు అభ్యర్థులపై కసరత్తు మొదలు పెట్టాయి. పంజాబ్ ఎన్నికల్లో ఈ సారి సోనూసూద్ సోదరి మాళవిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. దీంతో తన సోదరి ఎన్నికల్లో పోటీ చేస్తుండటం కారణంగా సోనూసూద్ ఓ కీలక బాధ్యత నుంచి తప్పుకున్నారు.
కరోనా కాలంలో ఎంతోమందికి ఎన్నోరకాల సేవలు అందించారు సోనూసూద్. ఆ తర్వాత కూడా ట్రస్ట్ ఓపెన్ చేసి ఎంతోమందికి సేవ చేస్తున్నాడు. కొన్ని సేవా కార్యక్రమాల్లో తన సోదరి కూడా పాల్గొంది. ఇటీవలే పంజాబ్ లో తన సోదరి నివసించే చుట్టుపక్క గ్రామాల్లో పేద ఆడపిల్లలకి సైకిల్స్ అందచేశారు. ప్రస్తుతం సోనూసూద్ సోదరి పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. అయితే పంజాబ్ ప్రభుత్వానికి స్టేట్ అఫ్ ఐకాన్ గా ఉన్నారు సోనూసూద్. తన సోదరి ఇప్పుడు పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో సోనూసూద్ స్వచ్ఛందంగా స్టేట్ ఆఫ్ ఐకాన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు.
Allu Arjun : ‘పుష్ప’ సినిమా.. థియేటర్లో ఒక ప్రింట్.. ఓటీటీలో మరో ప్రింట్
ఈ నిర్ణయాన్ని ఎన్నికల సంఘానికి కూడా తెలియచేసారు. ఈ విషయాన్ని సోనూసూద్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘అన్ని మంచి విషయాల్లాగానే స్టేట్ ఆఫ్ ఐకాన్ బాధ్యతలు కూడా ముగిశాయి. స్వచ్చందంగా నేను ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. ఎన్నికల సంఘంతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అని పోస్ట్ చేశారు సోనూసూద్.