Skin Fresh : వేసవిలో చర్మం తాజాగా, కాంతివంతంగా ఉండాలంటే!

కీరదోసకాయ, టేబుల్ స్పూన్ పంచదార తీసుకోవాలి. కీర దోస కాయ పొట్టు తొలగించి పేస్ట్ లా చేసుకోవాలి. దీనికి టేబుల్ స్పూన్ పంచదార కలిపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్ది సేపు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. చల్లగా అయిన తరువాత దానిని ముఖంపై అప్లై చేసుకోవాలి.

Skin Fresh : వేసవిలో చర్మం తాజాగా, కాంతివంతంగా ఉండాలంటే!

Skin Fresh And Radiant

Skin Fresh : వేసవి కాలంలో ఎండవేడి అధికంగా ఉంటుంది. ఎండలోకి వెళ్ళే వారి చర్మం కందిపోతుంది. దీని వల్ల చర్మం కాంతి విహానంగా మారుతుంది. వేసవిలో చర్మం తాజాగా, కాంతివంతంగా ఉండేందుకు ఇంట్లోనే వివిధ రకాల ఫేస్ ప్యాక్ లను సులభంగా తయారు చేసుకోవచ్చు. వీటి వల్ల చర్మం పాడైపోకుండా కాపాడుకోవచ్చు. అయితే ఎండ నుండి చర్మాన్ని రక్షించే ఫేస్ ఫ్యాక్ ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం….

పుదీనా ఫేస్ ఫ్యాక్ ; ఇందుకు గాను తాజా పుదీనా ఆకులు, చిటికెడు పుసుపు, ల్యూక్ వార్మ్ వాటర్ తీసుకోవాలి. తాజా పుదీనా ఆకులను మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. దీనికి చిటికెడు పసుపును కలిపి రెండింటిని బాగా కలపాలి. ల్యూక్ వార్మ్ వాటర్ తో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖంపై రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. వేసవి వేడి నుండి చర్మాన్ని పుదీనా ఫేస్  ఫాక్ రక్షిస్తుంది.

సోయాబీన్ ప్యాక్ ; 50 గ్రాముల సోయాబీన్, పచ్చి పాలు, బాదం నూనె, నీళ్లు తీసుకోవాలి. సోయాబీన్ ను రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే పొట్టు తీసేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. దీనికి బాదం నూనె, పచ్చి పాలు కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.

బనానా ఫేస్ ప్యాక్ ; సగం అరటి పండు, టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల సోర్ క్రీం , దూది కొద్దిగా, ల్యూక్ వార్మ్ వాటర్ తీసుకోవాలి. అరటిపండు, తేనె, సోర్ క్రీం మూడు కలిపి మెత్తని గుజ్జులాచేసుకోవాలి. ఈ మివ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత మెత్తని దూదితో తుడిచేయాలి. అనంతరం ల్యూక్ వార్మ్ వాటర్ తో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేసే ముఖం సున్నితంగా మారుతుంది.

కీరదోస ఫేస్ ప్యాక్ ; కీరదోసకాయ, టేబుల్ స్పూన్ పంచదార తీసుకోవాలి. కీర దోస కాయ పొట్టు తొలగించి పేస్ట్ లా చేసుకోవాలి. దీనికి టేబుల్ స్పూన్ పంచదార కలిపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్ది సేపు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. చల్లగా అయిన తరువాత దానిని ముఖంపై అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం పై మృతకణాలు, పేరుకుపోయిన జిడ్డు తొలగిపోతాయి.

టొమాటో ఫేస్ ప్యాక్ ; టొమాటో గుజ్జు, కొంచెం తేనె రెండు కలిపి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఎండకు కమిలిపోయిన చర్మం తిరిగి నిగారింపు సంతరించుకోవటానికి ఈ ప్యాక్ బాగా ఉపకరిస్తుంది.