Nirupam : భార్యకి ఏడువారాల నగలు కొనిచ్చిన డాక్టర్ బాబు..
తాజాగా డాక్టర్ బాబు భార్య మంజులతో కలిసి షాపింగ్ కి వెళ్ళాడు. సత్యనారాయణ వ్రతం ఉందంటూ ఆభరణాలు కొనుగోలు చేశారు. ఏకంగా ఏడువారాల నగలు తన భర్తతో కొనుగోలు.............
Nirupam : పలు సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు నిరుపమ్ పరిటాల కార్తీక దీపం సీరియల్ తో డాక్టర బాబుగా చాలా పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆయన అసలు పేరు మరచిపోయి డాక్టర్ బాబు అని పిలిచేంతగా ఆ క్యారెక్టర్ బాగా పాపులారిటీ తెచ్చుకుంది. ఇక నిరుపమ్ భార్య మంజుల కూడా సీరియల్ నటి. వీళ్ళిద్దరూ కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతూ తమ విశేషాలని అభిమానులతో పంచుకుంటున్నారు.
తాజాగా డాక్టర్ బాబు భార్య మంజులతో కలిసి షాపింగ్ కి వెళ్ళాడు. సత్యనారాయణ వ్రతం ఉందంటూ ఆభరణాలు కొనుగోలు చేశారు. ఏకంగా ఏడువారాల నగలు తన భర్తతో కొనుగోలు చేయించింది మంజుల. అయితే ఇవి వెండితో చేసి మీద బంగారం పూతపూసిన నగలు. వీరిళ్లద్దరూ కలిసి ఈ నగలు కొన్న షాపింగ్ ని వ్లాగ్ లాగా చేసి షాపింగ్ లోని ఫన్నీ మూమెంట్స్ ని జతచేసి అభిమానులతో పంచుకున్నారు.
Rakhi Sawant : నేనెలాంటి బట్టలు వేసుకోవాలో నా ప్రియుడే డిసైడ్ చేస్తాడు..
ఈ వీడియోలో సరదాగా నిరుపమ్, మంజుల ఒకరిపై ఒకరు సెటైర్స్ వేసుకున్నారు. అమ్మాయిలకు బట్టలు, నగలు పిచ్చి ఎప్పటికీ పోదని నిరుపమ్ కామెంట్ చేశాడు. ఇక మా ఆయన నాకు ఏడు వారల నగలు కొనిచ్చాడని తెగ సంతోషపడిపోతుంది మంజుల. సీరియల్స్ చూసే ప్రేక్షకులు ఈ వీడియోని తెగ చూసేస్తున్నారు.