ఇదే ఫస్ట్ టైమ్ : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

ఒకేసారి 50 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిన్న(ఫిబవ్రరి 02.2020) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రెండోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారం

  • Published By: veegamteam ,Published On : February 3, 2020 / 01:32 AM IST
ఇదే ఫస్ట్ టైమ్ : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

ఒకేసారి 50 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిన్న(ఫిబవ్రరి 02.2020) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రెండోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారం

ఒకేసారి 50 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిన్న(ఫిబవ్రరి 02.2020) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రెండోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత.. ఇంత భారీ సంఖ్యలో ఐఏఎస్‌ అధికారుల బదిలీలు జరగడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో అన్ని రకాల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పాలనా వ్యవహారాలపై దృష్టి పెట్టేందుకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులతో కొత్త జట్టుకు రూపకల్పన చేసుకుంది. ఒకేసారి 21 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. ఇక బదిలీల్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ కు కీలకమైన నీటిపారుదల శాఖ ఇచ్చింది. 

21 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించగా.. కీలకమైన శాఖల్లో అధికారులను మార్చారు. గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న చిత్రా రామచంద్రన్‌కు విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది. జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అధర్‌ సిన్హాను పశు సంవర్ధక శాఖకు ట్రాన్స్‌ ఫర్‌ చేసింది. మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న జగదీశ్వర్‌ను రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

ఇక పురపాలక శాఖ డైరెక్టర్‌ టీకే శ్రీదేవి, మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌ ను ఆర్థిఖ శాఖ ముఖ్య కార్యదర్శులుగా నియమించింది. విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌ రెడ్డికి వ్యవసాయ శాఖ.. సీఎం కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియాకు పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు లభించాయి. వికాస్‌ రాజ్‌ ను మరో కీలకమైన సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అలాగే ఏడాదిన్నరగా పోస్టింగ్ ల కోసం ఎదురు చూస్తున్న 16 మంది సబ్‌ కలెక్టర్లకు పోస్టింగ్ లు ఇచ్చారు. వారందరినీ ఐటీడీఏ పీవోలు, మున్సిపల్‌ కమిషనర్లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.

కొత్త పోస్టుల్లోకి:
గౌతమ్ పోత్రు – భద్రాచలం ఐటీడీఏ పీవో
రాహుల్ రాజ్ – జీహెచ్​ఎంసీ అడిషనల్ కమిషనర్
భవేశ్ మిశ్రా – ఉట్నూరు ఐటీడీఏ పీవో
హన్మంతు కొండిబా – ఏటూరునాగారం ఐటీడీఏ పీవో
వల్లూరు క్రాంతి – కరీంనగర్ మున్సిపల్ కమిషనర్
ఉదయ్ కుమార్ – రామగుండం మున్సిపల్ కమిషనర్

జితేశ్ వి పాటిల్ – నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్
గోపి – నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్
సంతోశ్ – జీహెచ్​ఎంసీ అడిషనల్ కమిషనర్
ప్రియాంక అళ – జీహెచ్​ఎంసీ అడిషనల్ కమిషనర్
ప్రావీణ్య – జీహెచ్​ఎంసీ అడిషనల్ కమిషనర్ 

 

అధికారి ప్రస్తుత పోస్టు బదిలీ అయిన పోస్టు
రజత్ కుమార్ సీఈవో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ
చిత్రా రామచంద్రన్ హౌజింగ్ ​స్పెషల్​ సీఎస్ విద్యా శాఖ స్పెషల్ సీఎస్
అధర్ సిన్హా జీఏడీ స్పెషల్​ సీఎస్ పశుసంవర్థక శాఖ స్పెషల్ సీఎస్
వికాస్ రాజ్ పీఆర్ ప్రిన్సిపల్​ సెక్రెటరీ జీఏడీ ప్రిన్సిపల్ సెక్రెటరీ
జగదీశ్వర్ విమెన్​ అండ్​ చైల్డ్​ డెవలప్​మెంట్​
ప్రిన్సిపల్​ సెక్రెటరీ
రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ
పార్థసారథి అగ్రికల్చర్​ ప్రిన్సిపల్​ సెక్రెటరీ ఎన్విరాన్ మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డీజీ
బుర్రా వెంకటేశం యూత్​ అఫైర్స్​ సెక్రెటరీ బీసీ వెల్ఫేర్ కమిషనర్
బి.జనార్దన్ రెడ్డి ఎడ్యుకేషన్​ సెక్రెటరీ వ్యవసాయ శాఖ కమిషనర్

తెలంగాణలో భారీగా IAS ల బదిలీలు
18మంది సీనియర్ ఐఏఎస్ లకు స్థాన చలనం
మరో 11 మంది సబ్ కలెక్టర్ ర్యాంక్ ఐఏఎస్ లును కూడా బదిలీ చేసిన ప్రభుత్వం

21 జిల్లాల కలెక్టర్లు బదిలీ
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా అబ్దుల్ అజీం
కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా శరత్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా ఎం.వి రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్గా శ్రీ దేవసేన
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గా శ్వేతా మహంతి
నల్లగొండ జిల్లా కలెక్టర్ గా పాటిల్ ప్రశాంత్ జీవన్

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా రాజీవ్ గాంధీ హనుమంతు
జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గా శృతి ఓజా
సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా వినయ్ కృష్ణారెడ్డి
మేడ్చల్ జిల్లా కలెక్టర్ గా వెంకటేశ్వర్లు
ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ గా సందీప్ కుమార్
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా సిక్త పట్నాయక్

నిర్మల్ జిల్లా కలెక్టర్ గా ముషారఫ్ అలీ
ములుగు జిల్లా కలెక్టర్ గా కృష్ణ ఆదిత్య
మహబూబాద్ కలెక్టర్ గా వీ.పీ. గౌతమ్
జగిత్యాల జిల్లా కలెక్టర్ గా రవి

జనగామ జిల్లా కలెక్టర్ గా కె. నిఖిల
వనపర్తి జిల్లా కలెక్టర్ గా ఎస్. కె. యాస్మిన్ బాషా
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గా ఎస్ వెంకట్రావు

Also Read : సమయం లేదు.. ఇక సెలవు: విజయశాంతి