Delhi airport: పైలట్ల సమ్మెతో నిలిచిపోయిన విమానాలు.. ప్రయాణికుల అవస్థలు.. ఆదుకోండి అంటూ వినతి

విమాన సర్వీసు నిలిచిపోవడంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు నిరసనకు దిగారు. ఢిల్లీ నుంచి మ్యునిచ్ వెళ్లాల్సి ఉన్న విమానం.. పైలట్ల సమ్మె కారణంగా నిలిచిపోయింది. ప్రయాణికులకు సంస్థ ఎలాంటి వసతి ఏర్పాటు చేయలేదు. దీంతో వారంతా ఆందోళనకు దిగారు.

Delhi airport: పైలట్ల సమ్మెతో నిలిచిపోయిన విమానాలు.. ప్రయాణికుల అవస్థలు.. ఆదుకోండి అంటూ వినతి

Delhi airport

Delhi airport: జర్మనీకి చెందిన విమానయాన సంస్థ లుఫ్తాన్సా పైలట్లు సమ్మె చేస్తుండటంతో ఆ సంస్థకు చెందిన విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో లుఫ్తాన్సా విమానాల్ని అధికారులు రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Bihar: మోకాలి లోతు వరద… డ్రమ్ములతో బోటు తయారు చేసి పేషెంట్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు

గురువారం సాయత్రం ఢిల్లీ నుంచి మ్యునిచ్ వెళ్లాల్సిన లుఫ్తాన్సా విమానం నిలిచిపోయింది. పైలట్ల సమ్మె కారణంగా విమాన సర్వీసు రద్దైంది. దీనికి సంబంధించి ప్రయాణికులకు ముందుగా ఎలాంటి సమాచారం లేదు. దీంతో.. మ్యునిచ్ వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. తమకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో నిరసనకు దిగారు. వందల సంఖ్యలో ఉన్న ప్రయాణికులు, వారి బంధువులు ఎయిర్‌పోర్టు వద్ద ధర్నా చేస్తున్నారు. దీనిపై స్పందించిన పోలీసులు, ఎయిర్‌పోర్టు అధికారులు ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఎయిర్‌పోర్టులో తాము పడుతున్న ఆందోళనను ఒక ప్రయాణికుడు ప్రధాని కార్యాలయం దృష్టికి తీసుకొచ్చాడు.

TS Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 6 నుంచి.. సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ తీర్మానం చేసే ఛాన్స్

ప్రయాణికుల్లో విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారని, తమ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని స్పందించాలని ప్రధాని కార్యాలయాన్ని కోరాడు. తమకు ఆహారం, వసతి లాంటివి కూడా ఏర్పాటు చేయలేదని చెప్పాడు. ఇక అంశంపై లుఫ్తాన్సా స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా తమ పైలట్లు సమ్మె చేస్తున్న కారణంగా శుక్రవారం ఒక్కరోజే 800 విమానాల్ని రద్దు చేసినట్లు తెలిపింది. దీనివల్ల దాదాపు 1,30,00 మంది ప్రయాణికులకు అసౌకర్యం కలిగిందని సంస్థ ప్రకటించింది. అయితే, ఇది ఒక్కరోజు సమ్మె మాత్రమే అని సంస్థ ప్రకటించింది. గురువారం అర్ధరాత్రి మొదలైన సర్వే.. శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగనుంది.