OkeOka Jeevitham Movie Review : ఒకేఒక జీవితం సినిమా రివ్యూ.. శర్వానంద్ ఏడిపించేశాడుగా..

ఒకేఒక జీవితం సినిమాని టైం ట్రావెల్, అమ్మ సెంటిమెంట్ కలిపి కొత్తగా తెరకెక్కించారు. వెన్నెల కిషోర్, ప్రియదర్శి ఉండటంతో కామెడీ కూడా బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. టైం ట్రావెల్, అమ్మ సెంటిమెంట్ ఉండటం, సినిమా చూసిన..................

OkeOka Jeevitham Movie Review : ఒకేఒక జీవితం సినిమా రివ్యూ.. శర్వానంద్ ఏడిపించేశాడుగా..

OkeOka Jeevitham Movie Review

OkeOka Jeevitham Movie Review :  శర్వానంద్, రీతూ వర్మ జంటగా అమల ముఖ్య పాత్రలో తెరకెక్కిన సినిమా ఒకేఒక జీవితం. కొత్త దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్ లో ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ్ లో నేడు సెప్టెంబర్ 9న రిలీజయింది. శర్వానంద్ గత సినిమాలు ఆశించినంత ఫలితం ఇవ్వకపోవడంతో ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు శర్వానంద్.

ఒకేఒక జీవితం సినిమాని టైం ట్రావెల్, అమ్మ సెంటిమెంట్ కలిపి కొత్తగా తెరకెక్కించారు. వెన్నెల కిషోర్, ప్రియదర్శి ఉండటంతో కామెడీ కూడా బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. టైం ట్రావెల్, అమ్మ సెంటిమెంట్ ఉండటం, సినిమా చూసిన సెలబ్రిటీలంతా ఎమోషనల్ అవ్వడంతో ఈ సినిమాపై ముందు నుంచి మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే ఒకేఒక జీవితం సినిమా అమెరికాలో ప్రీమియర్ షోలు, ఇక్కడ కొన్ని బెనిఫిట్ షోలు పడగా ప్రేక్షకుల నుంచి మంచి టాక్ వినిపిస్తుంది.

Suriya 42: సూర్య సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న ప్రభాస్.. మోషన్ పోస్టర్ అదిరిపోయిందిగా

ట్విట్టర్ రివ్యూ, సినిమా చూసిన ప్రేక్షకులు చెప్పిన దాన్నిబట్టి.. కథ, కథనం చాలా బాగున్నట్టు తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయాయని చెప్తున్నారు. ఇక సెకండ్ హాఫ్ లో కొంచెం స్లో నేరేషన్, బోరింగ్ సన్నివేశాలు ఉందని ప్రేక్షకులు అంటున్నారు. మళ్ళీ క్లైమాక్స్ బాగుందని చెప్తున్నారు. సినిమాకి ఎమోషనల్ ఎండింగ్ ఉందని, శర్వానంద్ ప్రేక్షకులని ఏడిపించేశాడని, మ్యూజిక్, విజువల్స్ కూడా చాలా బాగున్నాయని చెప్తున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు. శర్వానంద్, మెయిన్ ఆర్టిస్టులతో పాటు పిల్లలు కూడా బాగా యాక్ట్ చేశారని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఓవరాల్ గా అయితే సినిమా చాలా బాగుంది, శర్వానంద్ ఏడిపించేశాడు అని ప్రేక్షకులు అంటున్నారు.