Girls at Ranchi School: మాతో ఫ్రెండ్షిప్ చేయండి.. లేదంటే కిడ్నాప్ చేస్తాం.. స్కూల్లో అమ్మాయిలను బెదిరించిన పోకిరీలు

ఒక ప్రభుత్వ పాఠశాలలోకి ఆయుధాలతో ప్రవేశించిన కొందరు గూండాలు అక్కడ చదువుకుంటున్న అమ్మాయిలను బెదిరించారు. తమతో ఫ్రెండ్షిప్ చేయాలని.. లేకుంటే కిడ్నాప్ చేస్తామని బెదిరించారు. బాధిత విద్యార్థినిలు తొమ్మిదో తరగతి చదువుతున్నారు.

Girls at Ranchi School: మాతో ఫ్రెండ్షిప్ చేయండి.. లేదంటే కిడ్నాప్ చేస్తాం.. స్కూల్లో అమ్మాయిలను బెదిరించిన పోకిరీలు

Girls at Ranchi School: ప్రభుత్వ పాఠశాలలోకి ఆయుధాలతో ప్రవేశించిన కొందరు యువకులు అక్కడి విద్యార్థినిలపై బెదిరింపులకు పాల్పడ్డారు. తమతో ఫ్రెండ్షిప్ చేయాలని, లేకుంటే కిడ్నాప్ చేస్తామని బెదిరించారు. ఈ ఘటన ఇటీవల ఝార్ఖండ్‌లోని రాంచీ పట్టణంలో జరిగింది. దీనిపై తాజాగా పోలీసు కేసు నమోదైంది.

iOS 16 Update: నేటి నుంచే ఐఓఎస్ 16 వెర్షన్.. ఏయే ఫోన్లు అప్‌డేట్ చేసుకోవచ్చో తెలుసా!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికలపై కొందరు ముస్లిం యువకులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఆయుధాలు చేతబట్టిన కొందరు గూండాలు స్కూల్లోకి ప్రవేశించి, బెదిరించారు. తమతో ఫ్రెండ్షిప్ చేయాలి అని, లేదంటే కిడ్నాప్ చేస్తామని బెదిరించారు. ఈ సమయంలో టీచర్లు కూడా అక్కడే ఉన్నారు. వారిని కూడా యువకులు బెదిరించారు. దాదాపు వారం రోజులపాటు రోజూ ఇలాగే బెదిరించారు. చివరకు బాలికలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఇప్పటివరకు పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదు.

TSPSC Notification 2022: ఇంజనీరింగ్ ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల

కాగా, ఇక్కడ చదువుతోంది ఎక్కువగా గిరిజన, హిందూ బాలికలే. అయితే ప్రస్తుతం ఈ అంశం ఇరు వర్గాల మధ్య వివాదంగా మారింది. బెదిరింపులకు పాల్పడిన వాళ్లు ముస్లిం వర్గానికి చెందిన వారు కావడం, బాధిత విద్యార్థులు హిందువులు కావడంతో ఇది మరింత వివాదంగా మారింది. కాగా, ఈ ఘటనకు వర్గం, మతం రంగు పులమడం సరికాదని, నిందితులు ఎవరైనా సరే చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘటనపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. లవ్ జిహాద్‌లో భాగంగానే ఇలాంటివి జరుగుతున్నాయని, వీటిని అరికట్టాలని ప్రభుత్వాన్ని బీజేపీ డిమాండ్ చేసింది.