TSPSC Notification 2022: ఇంజనీరింగ్ ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి తాజాగా టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 883 ఇంజనీరింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

TSPSC Notification 2022: ఇంజనీరింగ్ ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల

TSPSC Notification 2022: తెలంగాణ నిరుద్యోగుల కోసం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్‌పీఎస్‌సీ. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 883 ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది టీఎస్‌పీఎస్‌సీ.

iOS 16 Update: నేటి నుంచే ఐఓఎస్ 16 వెర్షన్.. ఏయే ఫోన్లు అప్‌డేట్ చేసుకోవచ్చో తెలుసా!

ఉద్యోగ నియామక ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నెల 29 నుంచి అక్టోబర్ 21 వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https://www.tspsc.gov.in ని సంప్రదించవచ్చు. ఇప్పటికే టీఎస్‌పీఎస్‌సీ.. ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 29 లోపు ఇదే వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టు ప్రకటన.. జట్టులోకి తిరిగొచ్చిన బుమ్రా, హర్షల్ పటేల్

ఇంతకుముందు పంచాయతీ రాజ్ శాఖలో కూడా 529 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందులో జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు 253, సీనియర్ అసిస్టెంట్ ఖాళీలు 173, సూపరింటెండెంట్ ఖాళీలు 103 ఉన్నాయి. అలాగే మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పోస్టులతోపాటు, తెలంగాణ మహిళ, శిశు సంక్షేమ శాఖలో 23 పోస్టుల భర్తీకి కూడా టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.