COVID-19: నిన్న దేశంలో కొత్తగా 176 కొవిడ్ కేసులు నమోదు: కేంద్రం

దేశంలో రోజువారీ కరోనా కేసులు అతి తక్కువగా నమోదవుతున్నాయి. నిన్న దేశంలో కొత్తగా 176 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, కరోనా వల్ల నిన్న ఒకరు ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,46,75,952కు చేరిందని వివరించింది.

COVID-19: నిన్న దేశంలో కొత్తగా 176 కొవిడ్ కేసులు నమోదు: కేంద్రం

india corona cases

COVID-19: దేశంలో రోజువారీ కరోనా కేసులు అతి తక్కువగా నమోదవుతున్నాయి. నిన్న దేశంలో కొత్తగా 176 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, కరోనా వల్ల నిన్న ఒకరు ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,46,75,952కు చేరిందని వివరించింది.

ప్రస్తుతం దేశంలో ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో కరోనాకు చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 3,552కు చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా వల్ల సంభవించిన మృతుల సంఖ్య మొత్తం 5,30,672గా ఉందని వివరించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.01 శాతంగా ఉన్నాయని చెప్పింది.

కరోనా రికవరీ రేటు 98.8 శాతంగా ఉన్నాయని పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు వ్యాక్సిన్ వేయించుకున్న వారి సంఖ్య 2,20,00,36,789గా ఉందని చెప్పింది. నిన్న దేశ వ్యాప్తంగా 47,734 మందికి వ్యాక్సిన్లు వేసినట్లు తెలిపింది. నిన్న దేశంలో 1,14,792 మంది కరోనా పరీక్ష చేయించుకున్నట్లు వివరించింది.

Greater Noida Buses Collided : గ్రేటర్ నోయిడాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీకొని ముగ్గురు ప్రయాణికులు మృతి