Unstoppable 2: అన్‌స్టాపబుల్ ‘పవర్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. గెట్ రెడీ!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ 2 టాక్ షోకు ఇప్పటికే ఎలాంటి రెస్పాన్స్, క్రేజ్ దక్కుతుందో మనం చూస్తున్నాం. ఈ సీజన్ టాక్ షో చాలా చప్పగా సాగుతుందని అందరూ అనుకుంటున్న వేళ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ టాక్ షోకు రావడంతో ఒక్కసారిగా అన్‌స్టాపబుల్ 2కి బూస్టప్ వచ్చింది. ఇక ప్రభాస్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఈ టాక్ షోను ఏ విధంగా ఆసక్తిగా చూశారంటే, ఏకంగా ఆహా యాప్ క్రాష్ అయ్యేంతలా. అయితే ప్రభాస్ ఈ టాక్ షోకు వచ్చిన ఎపిసోడ్‌లను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేసింది ఆహా.

Unstoppable 2: అన్‌స్టాపబుల్ ‘పవర్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. గెట్ రెడీ!

Unstoppable 2 Pawan Kalyan Power Teaser To Be Out Today

Unstoppable 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ 2 టాక్ షోకు ఇప్పటికే ఎలాంటి రెస్పాన్స్, క్రేజ్ దక్కుతుందో మనం చూస్తున్నాం. ఈ సీజన్ టాక్ షో చాలా చప్పగా సాగుతుందని అందరూ అనుకుంటున్న వేళ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ టాక్ షోకు రావడంతో ఒక్కసారిగా అన్‌స్టాపబుల్ 2కి బూస్టప్ వచ్చింది. ఇక ప్రభాస్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఈ టాక్ షోను ఏ విధంగా ఆసక్తిగా చూశారంటే, ఏకంగా ఆహా యాప్ క్రాష్ అయ్యేంతలా. అయితే ప్రభాస్ ఈ టాక్ షోకు వచ్చిన ఎపిసోడ్‌లను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేసింది ఆహా.

Unstoppable 2: రేపే అన్‌స్టాపబుల్ ‘పవర్’ఫుల్ ఎపిసోడ్ గ్లింప్స్!

ఇక ఇప్పుడు అందరి చూపులు అన్‌స్టాపబుల్ 2లో పవర్‌ఫుల్ ఎపిసోడ్‌పైనే ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఈ టాక్ షోలో పాల్గొన్నాడని తెలుసుకుని, ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన టీజర్ అప్డేట్‌ను ఆహా అనౌన్స్ చేసింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవర్‌ఫుల్ ఎపిసోడ్‌కు సంబంధించిన పవర్ టీజర్‌ను ఇవాళ రాత్రి 8 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ఆహా తెలిపింది.

Unstoppable 2: అన్‌స్టాపబుల్-2 సంక్రాంతి స్పెషల్ ప్రోమో.. వీరసింహారెడ్డి టీమ్‌తో బాలయ్య సందడి మామూలుగా లేదుగా!

దీంతో అభిమానులు ఒక్కసారిగా ‘పవన్ కల్యాణ్ ఆన్ ఆహా’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తున్నారు. ఇక ఈ టీజర్ రిలీజ్ కావడంతోనే వారు దుమ్ములేపేందుకు రెడీ అవుతున్నారు. బాలయ్య ప్రశ్నలకు పవన్ సమాధానాలు ఎలా ఉండబోతున్నాయా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ ఎపిసోడ్‌ను ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారో ఇవాల్టి పవర్ టీజర్‌లో అనౌన్స్ చేస్తారేమో చూడాలి అంటున్నారు అభిమానులు.