Maha Shivaratri 2023: శివనామస్మరణతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు.. మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్.. Live Updates

తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. హరహర మహాదేవ శంభోశంకర, శివోహం అంటూ భక్తులు పరమశివున్ని స్మరిస్తున్నారు.

Maha Shivaratri 2023:  శివనామస్మరణతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు.. మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్..  Live Updates

Maha Shivaratri

Maha Shivaratri 2023: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ప్రముఖ శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజామునే భక్తులు శైవక్షేత్రాల వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి శివనామస్మరణ చేస్తున్నారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 18 Feb 2023 01:48 PM (IST)

    శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు..

    తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో శివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర శివాలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తున్నారు భక్తులు. వాయులింగంగా ముక్కంటి భక్తులకు కరుణిస్తున్నారు.

     

  • 18 Feb 2023 01:37 PM (IST)

    మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్

    మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. పార్వతీపరమేశ్వరుల శుభాశీస్సులు మనందరికీ అందాలని కోరుకుంటున్నానని ట్విటర్ ద్వారా తెలిపారు.

  • 18 Feb 2023 12:51 PM (IST)

    పట్టిసీమలో వైభవంగా మహా శివరాత్రి వేడుకలు..

    ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమలో మహాశివరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్దలతో జరుగుతున్నాయి. గోదావరి నది మధ్యలో వెలసిన భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. గోదావరిలో స్నానాలు ఆచరించి, శివుడికి పూజలు, అభిషేకాలు చేస్తున్నారు.

     

  • 18 Feb 2023 12:47 PM (IST)

    ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మహాశివరాత్రి శోభ..

    మహాశివరాత్రిని పురస్కరించుకొని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆలయాన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాలకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

     

  • 18 Feb 2023 12:19 PM (IST)

    కృష్ణానదిలో భక్తుల పుణ్య స్నానాలు..

    మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. ఇంద్రకీలాద్రిలో వేకువజాము నుంచి భక్తులు పవిత్ర కృష్ణా నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. దుర్గా ఘాట్, పున్నమి ఘాట్, పవిత్ర సంగమంతో పాటు హంసలదీవి , మంగినపూడి బీచ్ లతోపాటు నదీ పరివాహక ప్రాంతాల్లో భక్తుల తాకిడి పెరిగింది. పుణ్యస్నానాలు ఆచరించి, శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలతో భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు.

     

  • 18 Feb 2023 11:34 AM (IST)

    భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు ..

    శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు ఆలయాలకు వెళ్లి శివుడికి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో.. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని స్నానాల లక్ష్మీపురం గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా వెళ్లి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

  • 18 Feb 2023 11:21 AM (IST)

    వెయ్యి స్తంభాల గుడిలో పరమేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు..

  • 18 Feb 2023 10:54 AM (IST)

    కొమరవెల్లికి పోటెత్తిన భక్తులు..

    మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లికి భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామునుంచే భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు. గొల్ల కురుమల డప్పు వాయిద్యాలు, డమరుక నాదాలతో కొమురవెల్లి ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి. తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున తరలివచ్చిన గొల్ల కురుమలు, భక్తజనంతో ఆలయం ప్రాంగణం, పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోతున్నాయి. తోట బావి ప్రాంగణంలో నిర్వహించే పెద్ద పట్నానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

  • 18 Feb 2023 10:29 AM (IST)

    శివనామస్మరణతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు ..

  • 18 Feb 2023 10:27 AM (IST)

    శ్రీకాళహస్తిలో కిరణ్ అబ్బవరం ..

  • 18 Feb 2023 09:30 AM (IST)

    శివరాత్రి రోజు ఎలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటే..

    మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి రోజు శివుని ఆరాధనకు అత్యున్నతమైన రోజు. ఈరోజు భక్తులు అధికసంఖ్యలో ఉపవాసం ఉంటారు. అయితే, ఉపవాసం ఉన్నవారు కొన్ని ప్రత్యేక నియమాలు, జాగ్రత్తలు పాటించాలి. మహాశివరాత్రి ఉపవాస సమయంలో ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై పలువురు పండితులు పలు రకాల సూచనలు చేశారు.

    - మహాశివరాత్రి రోజు స్నానం చేయకుండా ఏమీ తినకూడదు. ఉపవాసం లేకపోయినా స్నానం చేయకుండా ఆహారం తీసుకోవద్దు. మహాశివరాత్రి రోజున నల్లని బట్టలు ధరించొద్దు. శివలింగంపై అందించే ప్రసాదాన్ని స్వీకరించొద్దు.

    - శివరాత్రి పర్వదినం రోజున ఉపవాసం ఉన్న సమయంలో పాలు, పండ్లు తీసుకోవచ్చు. సూర్యాస్తమయం తర్వాత ఏమీ తినకూడదు.

    - శివరాత్రి పర్వదినాన రాత్రి జాగరణ చేయడం మంచిది. జాగరణ సమయంలో శివుని స్తోత్రాలు వినండి. మరుసటి రోజు ఉదయం స్నానం చేసి ప్రసాదం తీసుకోవాలి.

    - శివలింగంపై కుంకుమ, తిలకం వేయొద్దు. గంధపు చెక్కను పూయవచ్చు.

    - శివుని పూజలో విరిగిన బియ్యాన్ని సమర్పించకూడదు. అదేవిధంగా శివుని పూజలో కేతకీ పుష్పం వాడొద్దు.

    maha shivaratri

    maha shivaratri

  • 18 Feb 2023 09:19 AM (IST)

  • 18 Feb 2023 09:02 AM (IST)

    మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి క్షేత్రం శివనామస్మరణతో మారుమోగుతోంది. శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారు జామున 3 గంటల నుంచే దర్శనం ప్రారంభమైంది. అదేవిధంగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర శివాలయంకు భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగుతుంది. మహాశివరాత్రి వేడుకను పురస్కరించుకొని నేడు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించనున్నారు. స్వామివారు ముక్కంటి వాయు లింగంగా ఇక్కడ భక్తులను కరుణిస్తారు. ఈనెల 14న ప్రారంభమైన స్వామి వారి శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.

  • 18 Feb 2023 08:55 AM (IST)

    శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..

    మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పాతాళగంగలో పున్యస్నానాలు ఆచరించి ఆది దంపతులను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 7గంటలకు స్వామి అమ్మవార్లకు నందివాహన సేవ నిర్వహించనున్నారు. జగద్గురు పీఠాధిపతి మల్లికార్జునుడికి అభిషేకం చేయనున్నారు. రాత్రి 12 గంటలకు స్వామి, అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహిస్తారు.

  • 18 Feb 2023 08:47 AM (IST)

    యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి అనుబంధ అలయమైన పర్వత వర్ధిని సమేత శ్రీరామలింగేశ్వర స్వామి వారి ఆలయం‌లో మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పర్వతవర్ధిని శ్రీరామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండువగా కొనసాగుతుండగా.. స్వామివారికి ఆలయ ఇన్‌చార్జి ఈవో రామకృష్ణ రావు, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు.

  • 18 Feb 2023 08:44 AM (IST)

    ఎమ్మెల్యే సైదిరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు ..

    మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సూర్యాపేట జిల్లాలోని శైవక్షేత్రాలు శివ నామస్మరణతో మారు మోగుతున్నాయి. మేళ్లచెరువు మండల కేంద్రంలోని శ్రీ ఇష్టకామేశ్వరి సమేత స్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి దంపతులు అభిషేక పూజల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తెల్లవారుజామున 3గంటల నుండే శివున్ని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. పిల్లల‌మర్రి శివాలయాలకు భక్తులు పోటెత్తారు.

  • 18 Feb 2023 08:35 AM (IST)

    మహాశివరాత్రి సందర్భంగా ఏలూరు శ్రీచౌడేశ్వరి రామలింగేశ్వర స్వామి ఆలయంకు భక్తులు పోటెత్తారు. వేలాదిగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం పాలకమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పశ్చిమ ముఖంగా వేంచేసి ఉన్న స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు.. విశిష్ట పూజలు, అర్చనలు, అభిషేకాలు చేస్తున్నారు.

  • 18 Feb 2023 08:32 AM (IST)

    మహా శివరాత్రి సందర్భంగా విజయవాడలోని శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. పున్నమిఘాట్, దుర్గా ఘాట్, పవిత్ర సంగమంతో పాటు నదీ పరివాహక ప్రాంతాల్లోని ఘాట్లలో భక్తులు భారీగా తరలివచ్చి పుణ్య స్నానాలాచరిస్తున్నారు. పాత శివాలయం, యనమలకుదురు శివాలయం‍‌తో‌పాటు, ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శివయ్య దర్శనార్ధం భక్తులు బారులు తీరారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.

  • 18 Feb 2023 08:30 AM (IST)

    మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వీరంపాలెంలో శ్రీ బాలత్రిపుర సుందరి ఆధ్యాత్మిక పీఠం‌లో రాష్ట్ర డిప్యూటీ సీఎం, దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఉండి శాససభ్యులు మంతెన రామరాజులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి స్పటిక లింగాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండే స్పటిక లింగ దర్శనంకు భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. పరమేశ్వరుని కరుణ కటాక్షాలు ప్రజలందరి‌పైన ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

  • 18 Feb 2023 08:24 AM (IST)

  • 18 Feb 2023 08:15 AM (IST)

    శివనామస్మరణతో మారుమోగుతున్న వేములవాడ రాజన్న క్షేత్రం ..

    మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజన్నసిరిసిల్ల జిల్లాలో శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన వేములవాడ రాజన్న క్షేత్రంకు భక్తుల తాకిడి భారీగా ఉండటంతో శివనామస్మరణతో మారుమోగుతుంది. భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. భిన్నమైన అచార సంప్రదాయాలతో వేములవాడలో మహా శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అన్ని‌ శైవ క్షేత్రాలలో శివ కళ్యాణం జరుగుతుండగా, వేములవాడ‌లో మాత్రం మహాలింగార్చన కన్నుల పండుగగా జరుగనుంది.

  • 18 Feb 2023 08:11 AM (IST)

    మహాశివరాత్రి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం‌కు భక్తుల తాకిడి భారీగా పెరిగింది. తెల్లవారుజాము నుండి వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి పవిత్రమైన త్రివేణి సంగమంలో పుణ్య‌స్నానాలు ఆచరించి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారు.

  • 18 Feb 2023 08:08 AM (IST)

    కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న మంత్రి చెల్లిబోయిన ..

    డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. జిల్లాలోని కోటిపల్లిలో మహాశివరాత్రి పురస్కరించుకుని భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామంలో భక్తులు తెల్లవారుజాము నుంచి భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. రామచంద్రపురం మండలం దాక్షారామంలో మహాశివరాత్రి పురస్కరించుకుని శ్రీ భీమేశ్వర స్వామివారిని ఏపీ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ ఈవో, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం కే. గంగవరం మండలం కోటిపల్లి‌లో శ్రీ చాయ సోమేశ్వర స్వామివారిని మంత్రి వేణుగోపాలకృష్ణ దర్శించుకున్నారు.

  • 18 Feb 2023 07:58 AM (IST)

    కాకినాడ జిల్లా సామర్లకోట పంచారామాలలో ఒక్కటైన శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో మహశివరాత్రి పర్వదిననాన్ని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకొనేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. అర్థరాత్రి 1గంట సమయం నుండే భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

  • 18 Feb 2023 07:55 AM (IST)

    డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో..

    డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. మురమళ్ల శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి, ముమ్మిడివరం శ్రీ ఉమా సూరేశ్వరస్వామి, కుండళేశ్వరం శ్రీ పార్వతీ కుండళేశ్వరస్వామి, మగసానితిప్ప శ్రీ కాలభైరవ స్వామి ఆలయాల్లో భక్తులు తెల్లవారుజాము నుంచే బారులుతీరి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో ఆయా ఆలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి.

  • 18 Feb 2023 07:47 AM (IST)

    పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మహాశివరాత్రి సందర్భంగా వశిష్ట గోదావరి నదీతీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఉదయం మూడు గంటల నుండి గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గోదావరి నది ఒడ్డున ఉన్న అభయ శివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా నరసాపురం మండలం లక్ష్మీనేశ్వరం గ్రామం దుర్గ లక్ష్మీనేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామునుండి భక్తులు ఆలయానికి పోటెత్తి శివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

  • 18 Feb 2023 07:38 AM (IST)

    శివనామస్మరణతో మారుమోగుతున్న కోవ్వూరు గోష్పాద క్షేత్రం ..

    తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు‌లో గోష్పాద క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ బాలా త్రిపుర సుందర సమేత సుందరేశ్వర స్వామికి భక్తితో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో సుందరేశ్వర స్వామి ఆలయం శివ నామస్మరణతో మారుమోగుతుంది. అదేవిధంగా శివునికి ఎంతో ప్రీతికరమైన శనివారం త్రయోదశి పర్వదినాన శివరాత్రి కలసిరావడంతో భక్తులు శివుని దర్శనానికి పోటెత్తుతున్నారు. నూట నలభై ఐదు సంవత్సరాల తర్వాత మరల ఈ పవిత్ర శని త్రయోదశి రోజున శివరాత్రి రావడం విశేషం. భారీగా భక్తులు తరలిరావడంతో.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వివిధ శాఖల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

  • 18 Feb 2023 07:31 AM (IST)

    పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. శనివారం శని త్రయోదశి కూడ కావడంతో స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలను భక్తులు నిర్వహిస్తున్నారు.

  • 18 Feb 2023 07:28 AM (IST)

    మహాశివరాత్రి రోజున శివునికి కేతకీ పుష్పాలను పూజలో సమర్పించకూడదు. అంతేకాక.. కనేర్, తామర, ఎరుపు రంగు పుష్పాలను కూడా శివలింగంపై సమర్పించకూడదు. శివలింగ పూజలో ధాతుర పుష్పం, తెలుపు రంగు పుష్పాలను వినియోగించడం చాలా శ్రేయస్కరం.

  • 18 Feb 2023 07:16 AM (IST)

    మహాశివరాత్రి రోజున శివలింగాన్ని పూజించడం ద్వారా జాతకంలో ఉన్న నవగ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు పేర్కొంటున్నారు. అదేవిధంగా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. శివలింగంపై బెల్పాత్రను సమర్పించడం ద్వారా వ్యాపారంలో పురోగతి లభిస్తోంది.

  • 18 Feb 2023 07:11 AM (IST)

    మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే కైలాస నాథుడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలైన శ్రీశైలం, ద్రాక్షారామం, కోటప్పకొండ, శ్రీకాళహస్తితోపాటు వేములవాడ, కాళేశ్వరం, కీసరకు భక్తులు పోటెత్తుతున్నారు.

  • 18 Feb 2023 07:04 AM (IST)

    శివ పురాణం ప్రకారం.. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండి, నీటిని కూడా సేవించకుండా శివుడిని పూజించిన భక్తులు సకల సంతోషాలను పొందుతారు. మహాశివరాత్రి ఉపవాసం అనేక రెట్లు పుణ్యాన్ని ఇస్తుంది.

  • 18 Feb 2023 06:56 AM (IST)

    మహాశివరాత్రి పూజా విధానం..

    మహాశివరాత్రి రో్జున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఈ రోజున ఆకుపచ్చని దుస్తులు ధరించడం శుభపద్రం. ఆ తరువాత శివాలయానికి వెళ్లి స్వచ్ఛమైన నీరు, చెరుకు రసం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి మొదలైన వాటితో శివలింగానికి అభిషేకం చేయాలి. పండ్లు, స్వీట్లు మొదలైన వాటిని దేవునికి సమర్పించాలి. చివరిగా శివ చాలీసా చదవాలి. శివుని మంత్రాలను పఠించండి, శివుని ఆరతి పాడటం చేయాలి.