IT Raids In Hyderabad : హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు.. రియల్ ఎస్టేట్ కంపెనీలు, డైరెక్టర్ల నివాసాల్లో తనిఖీలు

హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు జురుగుతున్నాయి. నగరంలోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు, డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. ఏక కాలంలో నగరంలోని 20 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

IT Raids In Hyderabad : హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు.. రియల్ ఎస్టేట్ కంపెనీలు, డైరెక్టర్ల నివాసాల్లో తనిఖీలు

IT raids

IT Raids In Hyderabad : హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు జురుగుతున్నాయి. నగరంలోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు, డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. ఏక కాలంలో నగరంలోని 20 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. నగరంలోని గూగి రియల్ ఎస్టేట్ కంపెనీ, ఫార్మా హిల్స్, వండర్ సిటీ, రాయల్ సిటీతోపాటు పలు రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ సుఖ్ నగర్ లోని గూగీ ప్రధాన కార్యాలయంలో ఐదు బృందాలతో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్ లో 20 చోట్ల ఏకకాలంలో రియల్ ఎస్టేట్ కంపెనీల డైరెక్టర్ల నివాసాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గూగీ రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఏకకాలంలో దాదాపు 20 చోట్ల రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఆ కంపెనీలకు సంబంధించిన పలువురు డైరక్టర్ల నివాసాల్లో  ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

IT Raids In Hyderabad : హైదరాబాద్ లో ఐటీ దాడులు.. ఎక్సెల్ కంపెనీ ఆఫీసుల్లో పలు డాక్యుమెంట్లు సీజ్

గూగి రియల్ ఎస్టేట్ కంపెనీ, ఫార్మా హిల్స్, వండర్ సిటీ, రాయల్ సిటీతోపాటు పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డాయనే ప్రధాన అభియోగాలతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపుల విషయంలో ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు అవకతవకలకు పాల్పడ్డాయని ఐటీ శాఖకు అనేక ఫిర్యాదు అందాయి. ఆ ఫిర్యాదుల నేపథ్యంలోనే ఇవాళ (మంగళవారం) గూగీ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ లోని కొత్తపేట, దిల్ సుఖ్ నగర్, సైబరాబద్, గచ్చిబౌలిలోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. సాయంత్రం వరకు కూడా తనిఖీలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటివరకు జరిపిన సోదాల్లో పలు కంపెనీలకు సంబంధించిన ఆర్థికలావాదేవీలు, కంపెనీ డాక్యుమెంట్లను ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.