Abdullapuret Naveen Case : అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసు.. సంచలన విషయాలు వెల్లడించిన నిందితుడు హరిహర కృష్ణ

అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు హరిహర కృష్ణకు పోలీస్ కస్టడీ ముగిసింది. కస్టడీ విచారణలో ఎట్టకేలకు హరిహర కృష్ణ నోరు విప్పారు. నవన్ హత్యకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు.

Abdullapuret Naveen Case : అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసు.. సంచలన విషయాలు వెల్లడించిన నిందితుడు హరిహర కృష్ణ

NAVEEN (2)

Abdullapuret Naveen Case : అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు హరిహర కృష్ణకు పోలీస్ కస్టడీ ముగిసింది. కస్టడీ విచారణలో ఎట్టకేలకు హరిహర కృష్ణ నోరు విప్పారు. నవన్ హత్యకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. నవీన్ ను ఎందుకు హత్య చేశాడు? ఎందుకు హత్య చేయాల్సివచ్చింది? ఎలా హత్య చేశాడు? ఎప్పుడు.. ఎక్కడ హత్య చేశాడు? అన్న విషయాలను హరిహర కృష్ణ పోలీసుల విచారణలో వెల్లడించారు. ఆ వివరాలన్నీ అతన్ని మాటల్లో.. ఇంటర్ 2017-2019 మధ్య దిల్ సుఖ్ నగర్ లోని ఐడియల్ జూనియర్ కాలేజ్ లో చదువుకున్నాను.  నవీన్ నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ లో పరిచయం అయ్యాడు.

నవీన్ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో, నేను అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాము. నవీన్ నా దగ్గరికి, నేను నవీన్ కాలేజ్ దగ్గరికి తరుచూ వెళ్లి కలుసుకునే వాళ్ళము. నవీన్ కు నీహారిక పరిచయం అయ్యాక…ఇద్దరూ ప్రేమించుకుని అక్కడక్కడ తిరిగేవారు. ఇద్దరు ఆ విషయాలు అన్నీ నాకు చెప్పేవారు. నవీన్ ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు అని…నీహారిక గొడవ పడి, నవీన్ తో సరిగ్గా మాట్లాడటం లేదు. నీహారిక అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఆమెతో చనువుగా వుండే వాడిని. నవీన్, నీహారిక ఇద్దరు విడిపోయారు అని చూసి..9 నెలల క్రితం నేను ప్రేమిస్తున్నాను అని నీహారికకు చెప్పిన…నీహారిక కూడా ఒప్పుకుంది.

Abdullapurmet Naveen Case : నవీన్ హత్య కేసు.. హరిహర కృష్ణకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్, చర్లపల్లి జైలుకు తరలింపు

అప్పటి నుండి ఇద్దరం ప్రేమించుకుంటున్నాం..నవీన్ అప్పుడప్పుడు నీహారికకు కాల్ చేసి, మెసేజ్ లు చేస్తూ ఇబ్బంది పెట్టేవాడు. నవీన్ ఫోన్ చేసినా నీహారిక మాట్లాడేది కాదు. నవీన్ వేరే అమ్మాయిలతో తిరుగుతూ.. నిహారికను ఇబ్బంది పెడుతున్నాడు అని కోపంతో..నవీన్ ను చంపాలని మూడు నెలల క్రితం డిసైడ్ అయ్యాను. రెండు నెలల కింద ..మలక్ పేట డీ మార్ట్ లో 200 రూపాయలకు ఒక కత్తి కొన్నాను. మర్డర్ టైంలో నా ఫింగర్ ప్రింట్స్ పడకుండా …మెడికల్ షాప్ లో రెండు జతల ప్లాస్టిక్ గ్లౌజ్ లు కొన్నాను. అవి ఎవరికీ కనపడకుండా…నా బ్యాగ్ లో పెట్టీ, మా ఇంట్లోని సజ్జ మీద పెట్టినాను. జనవరి 16న, మా ఇంటర్ ఫ్రెండ్స్ అంతా కలుసుకోవాలని అనుకున్నాము.

కుదిరితే అదే రోజు నవీన్ ను హత్య చేయాలని అనుకున్నా… కానీ ..ఆ రోజు అందరూ కలవడానికి కుదురలేదు. ఫిబ్రవరి 17 న ఉదయం 9 గంటలకు నవీన్ నాకు కాల్ చేసి , హైదరాబాద్ వస్తున్నానని చెప్పాడు. ఆ రోజు నేను, నా ఫ్రెండ్ జీవన్ ఇద్దరం కలిసి ఉప్పల్ లో ఆంట్ మాన్ సినిమాకి వెల్లినాము. నవీన్ ఎల్ బి నగర్ లో వున్నాను అని నాకు కాల్ చేసాడు. నా బైక్ పై వెళ్లి ..నేను, జీవన్ పిక్ అప్ చేసుకున్నాము. నాగోల్ లో భోజనం చేశాక…జీవన్ వెళ్ళిపోయాడు. నేను, నవీన్ మలక్ పేటలోని మా ఇంటికి వెళ్ళాము. ఆ రోజు రాత్రి నవీన్ హాస్టల్ కు వెళతాను అంటే…నేను కూడా వస్తా అని చెప్పాను.

Abdullapurmet Naveen Case : దోషులకు ఉరి శిక్ష వేయకపోతే పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటాం : నవీన్ తండ్రి శంకర్ నాయక్

నవీన్ ను చంపటానికి ఇదే మంచి ఛాన్స్ అనుకుని..సజ్జ మీద వున్న బ్యాగ్ తీసుకున్నా..నా ఫోన్ నుండి నవీన్ నీహారికకు కాల్ చేసి 6,7 నిముషాలు మాట్లాడినాడు..ఆ తరువాత రాత్రి 11 గంటలకు orr దాటగానే .. ఈ టైంలో అంత దూరం వద్దు అని చెప్పి.. మందు తాగినము. ఆ తరువాత.. నిహారిక గురించి నీకు ఒక విషయం చెప్పాలి అన్నాను. అందుకు నవీన్ కూడా సరే ఏంటో చెప్పు అన్నాడు. కొంచెం లోపలికి వెళ్తే నీకు విషయం మొత్తం చెప్తాను అని చెప్పడంతో నవీన్ కూడా ఓకే అన్నాడు. ఎవరు లేని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నిహారికను నేను ప్రేమిస్తున్నానని నిహారికను ఫోన్లు చేసి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని ప్రశ్నించాను.

వెంటనే నవీన్ నన్ను చేతులతో కొట్టాడు. అప్పటికే నవీన్ ను చంపాలన్న ప్లాన్ తో ఉన్న నేను అతన్ని బలంగా కొట్టి.. గొంతు నులిమి చంపేశాను. ఆ తర్వాత శ్వాస ఆడట్లేదని నిర్ధారించుకుని నా బ్యాగులో ఉన్న కత్తితో నేను ప్రేమించిన అమ్మాయిని ఇబ్బంది పెడతావా అంటూ ..కోపంతో చాతి భాగం నుంచి పొట్ట భాగం వరకు అడ్డం, పొడుగు కోసేసి.. నా ప్రియురాల్ని ప్రేమిస్తావా అని అతని గుండెను శరీరం నుండి వేరు చేసి.. నా ప్రియురాలి దగ్గరికి శారీరకంగా కలుస్తావా అని అతని మర్మాంగాన్ని కోసేసిన.. ఆ తర్వాత శవాన్ని ఎవరికీ కనబడకుండా చెట్లపొదల్లో పడేశాను.

Abdullapurmet Naveen Case : నవీన్ హత్య కేసు నిందితులకు 14 రోజులు రిమాండ్.. చర్లపల్లి జైలుకు హసన్, చంచల్ గూడ జైలుకు నిహారిక తరలింపు

ఆ తర్వాత నవీన్ శరీర భాగాలన్నీ ఓ బ్యాగులో వేసుకొని బ్రాహ్మణపల్లి వైపు వెళ్లాను. అతని సెల్ ఫోన్ ని రోడ్డు పక్కన పడేసాను. రక్తంతో ఉన్న నవీన్ శరీర భాగాలను ఎక్కడైనా దూరంగా పడేయాలని.. రాజీవ్ గృహకల్ప వెనకాల చెట్లపొదల్లో పడేశాను. బ్రాహ్మణ పళ్లిలో నేను నా ఫ్రెండ్ హాసన్ ఇంటికి వెళ్ళినాను. బాత్రూంలోకి వెళుతూ ఇంట్లో ఉన్న ఒక ఖాళీ ప్లాస్టిక్ బియ్యం సంచిని బాత్రూంలోకి తీసుకెళ్లి అతనికే తెలియకుండా రక్తంతో ఉన్నా నా బట్టలు విప్పేసి సంచిలో వేసి బాత్రూంలో ఉన్న హసన్ బట్టలు వేసుకున్నాను. తర్వాత నేను బయటికి వచ్చాక నా బట్టలు ఎందుకేసుకున్నావని అడిగితే నేను నవీన్ ని చంపిన విషయం చెప్పాను.

అప్పుడు హసన్ భయపడి ఎందుకు అలా చేశావు అని నన్ను తిట్టి వెంటనే పోలీసులకు లింగిపోవాలని చెప్పాడు. ఇప్పుడు చీకటి అయింది ఉదయం వెళ్తాను అని అతనికి చెప్పాను. అతను వద్దు అని చెప్పినా వినకుండా నేను అక్కడే ఆ రోజు రాత్రి పడుకుని మరుసటి రోజు ఉదయం లేచి నేను పోలీసులకు లొంగిపోతానని చెప్పి రక్తంతో ఉన్న నా బట్టలు, షూస్ బ్యాగును సాగర్ కాంప్లెక్స్ బస్ స్టాప్ వద్ద రోడ్డు పక్కన చెత్త కుప్పలో పడేశాను. ఉదయం 10 గంటలకు నిహారికకు ఫోన్ చేసి రోడ్డు మీదకి రమ్మన్నాను.  అప్పుడు నవీన్ ని నేను చంపానని నిహారికతో చెప్పాను. దాంతో ఆమె భయపడి ఎందుకలా చేసినావు అని నన్ను తిట్టి మందలించింది.

Naveen Case : నవీన్ హత్యకు ప్రధాన కారణం అదే.. 3 నెలలు వెయిట్ చేసి మరీ లేపేశాడు

ఆ తర్వాత నేను మా ఇంటికి వెళ్లి నా బండిని మా ఇంటి దగ్గర పెట్టి వరంగల్లో ఉన్న మా నాన్న దగ్గరికి వెళ్ళాను. ఈ విషయం మా నాన్నకి చెప్పలేదు.. ఆ తర్వాత మా నాన్నకు విషయం చెప్పడంతో పోలీసుల ముందు లొంగీ పోవాలని చెప్పాడు. నేను 24వ తేదీ హాసన్ ఇంటికి రాగా పోలీసు వారు నీ గురించి నన్ను అడుగుతున్నారు ఇంకా ఎందుకు పోలేదు అని నిలదీశాడు. దీంతో నేరుగా నవీన్ శరీర భాగాలు పడేసిన ప్రాంతానికి వెళ్లి ఆ సంచిని తీసుకొని.. హత్య చేసిన స్పాట్ కి వచ్చాను. అక్కడే శరీర భాగాలన్నీ కాల్చేశాను.. ఆ తర్వాత అబ్దుల్లాపూర్ మెట్ పోలీసుల ముందు లింగిపోయి హత్య విషయం చెప్పాను అని విపులంగా వివరించారు.

నవీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహర కృష్ణ పోలీస్ కస్టడీ ముగిసింది. వారం రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు హరిహర కృష్ణకు వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జీ ముందు ప్రవేశపెట్టారు. హరిహర కృష్ణకు న్యాయమూర్తి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించారు. పోలీసులు అతన్ని చర్లపల్లి జైలుకు తరలించారు. వారం రోజుల కస్డడీలో విచారణలో పోలీసులు మరికొన్ని కీలక ఆధారాలను సేకరించారు. సీన్ రీకన్ స్ట్రక్షన్ కూడా చేశారు. హరిహర కృష్ణ ఇచ్చిన ఆధారాలతో అతని స్నేహితుడు హసన్, ప్రియురాలు నిహారికను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను చర్లపల్లి, చంచల్ గూడ జైలుకు తరలించారు.