థియేటర్‌లో భారతీయుడు-2 సినిమా చూస్తుండగా కత్తితో దాడి, కమల్ హాసన్ స్టైల్‌లో..

థియేటర్ లో కత్తి దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రేక్షకులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది.

థియేటర్‌లో భారతీయుడు-2 సినిమా చూస్తుండగా కత్తితో దాడి, కమల్ హాసన్ స్టైల్‌లో..

Attack In Cinema Theatre (Photo Credit : Google)

Attack In Cinema Hall : వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో దారుణం జరిగింది. సినిమా థియేటర్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. భారతీయుడు-2 సినిమా చూస్తుండగా సినిమా హాల్ లో కత్తితో దాడి చేశాడో వ్యక్తి. కమల్ హాసన్ స్టైల్ లో విజయ్ అనే యువకుడిని కత్తితో పొడిచాడు కృష్ణ. ఈ దాడిలో విజయ్ కి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వర్ధన్నపేటలోని భారతీయ థియేటర్ లో ఈ ఘటన జరిగింది.

సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. థియేటర్ లో కత్తి దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రేక్షకులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. దాడి చేసిన కృష్ణ స్వస్థలం వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం. బాధితుడు విజయ్ ది తొర్రూరు మండలం అమ్మాపురం.