Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఐఫోన్ 14, పిక్సెల్ 7, నథింగ్ ఫోన్లపై భారీ డీల్స్.. ఏ ఫోన్ కొంటే బెటర్ అంటే?
Flipkart Big Saving Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను మార్చి 11న ప్రారంభం కానుంది. మార్చి 15 వరకు కొనసాగే ఈ సేల్‌లో ఆపిల్ (iPhone 14, iPhone 14 Plus)తో సహా ప్రముఖ స్మార్ట్ఫోన్లపై నథింగ్ ఫోన్ (1), Pixel 6a ఫోన్లపై అనేక భారీ డీల్‌లను అందించనుంది.
Flipkart Big Saving Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను మార్చి 11న ప్రారంభం కానుంది. మార్చి 15 వరకు కొనసాగే ఈ సేల్‌లో ఆపిల్ (iPhone 14, iPhone 14 Plus)తో సహా ప్రముఖ స్మార్ట్ఫోన్లపై నథింగ్ ఫోన్ (1), Pixel 6a ఫోన్లపై అనేక భారీ డీల్‌లను అందించనుంది. Flipkart ICICI బ్యాంక్ కార్డ్ హోల్డర్ల కోసం ప్రత్యేక డీల్స్, డిస్కౌంట్లను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లను వెల్లడించినా.. ఈ-కామర్స్ వెబ్సైట్లో కొన్ని డీల్స్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో కొన్ని డీల్‌లు అందుబాటులో ఉన్నాయి.
iPhone 14, iPhone 14 Plus సేల్ :
ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో భారీ ధర తగ్గింపును పొందే అవకాశం ఉంది. ఆపిల్ iPhone 14 ఫోన్ ధర రూ. 60,009 నుంచి రూ. 69,999 మధ్య ఉండవచ్చు. అదేవిధంగా, ఐఫోన్ 14 ప్లస్ కూడా ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో రూ. 80వేల లోపు సేల్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం, ఐఫోన్ 14 ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 71,999 వద్ద అందుబాటులో ఉంది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.79,999 కన్నా తక్కువగా ఉంది. ఈ సేల్ సమయంలో, స్మార్ట్‌ఫోన్ ధరను రూ. 60వేలకి తగ్గాలంటే బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను పొందవచ్చు.
Nothing Phone (1) :
ప్రముఖ నథింగ్ ఫోన్ (1) సేల్ సమయంలో భారీ డిస్కౌంట్లతో అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం బేస్ 128GB వేరియంట్‌కు రూ. 27,999కి అందుబాటులో ఉంది. సేల్ సమయంలో, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కలిపి ఈ డివైజ్ ధరను రూ.25,000కి తగ్గించవచ్చు. నథింగ్ ఫోన్‌పై కచ్చితమైన డీల్‌ను ఫ్లిప్‌కార్ట్ ఇంకా వెల్లడించలేదు. సేల్ ప్రారంభమైన వెంటనే డీల్ ప్రారంభం కానుంది.
Google Pixel 7 :
కొత్తగా లాంచ్ అయిన ఈ పిక్సెల్ 7 ఫోన్ ధర రూ. 59,999కు అందుబాటులో ఉంది. రాబోయే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days Sale) సమయంలో రూ. 50వేల కన్నా తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది. Pixel 7 సిరీస్‌పై ఆసక్తి ఉన్న ఎవరికైనా భారీ డీల్స్ పొందవచ్చు. సేల్ సమయంలో పిక్సెల్ 7 Pro కూడా తగ్గింపు ధరకు సేల్ అందుబాటులో ఉంది. ధర తగ్గింపు ఎంత అనేది ఇంకా ప్రకటించలేదు. రెండు డివైజ్‌లు ఫీచర్లు, పర్ఫార్మెన్స్ పొందవచ్చు. తద్వారా తమ ఫోన్‌ని అప్‌గ్రేడ్ చేయాలనుకునే ఎవరికైనా తక్కువ ఖర్చుతో సొంతం చేసుకోవచ్చు.