Saindhav: సైంధవ్ నుండి ఎంట్రీ ఇస్తున్న ‘జాస్మిన్’.. ఎప్పుడంటే..?
స్టార్ హీరో వెంకటేష్ నటిస్తున్న ‘సైంధవ్’ మూవీలో జాస్మిన్ అనే పాత్రలో నటిస్తున్న హీరోయిన్ ఎవరనే విషయాన్ని రేపు రివీల్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
Saindhav: విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సైంధవ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుండగా, ఈ మూవీ నుండి వరుస అప్డేట్స్ ఇస్తూ చిత్ర యూనిట్ సందడి చేస్తోంది.
Saindhav: సైంధవ్ కోసం ‘హిట్’ భామను పట్టుకొచ్చిన శైలేష్..!
సైంధవ్ మూవీలో నటిస్తున్న హీరోయిన్లను ఒక్కొక్కరిగా ఇంట్రొడ్యూస్ చేస్తున్న చిత్ర యూనిట్, ఇప్పుడు మరో హీరోయిన్ను పరిచయం చేయబోతుంది. ఈ సినిమాలో జాస్మిన్ అనే పాత్రలో నటిస్తున్న హీరోయిన్ ఎవరనేది ఏప్రిల్ 28న రివీల్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. సైంధవ్ మిషిన్‌లో జాస్మిన్ ఫైర్‌బ్రాండ్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. దీంతో జాస్మిన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
Saindhav: సైంధవ్ నుండి సాలిడ్ అప్డేట్.. రేణు వస్తోందట!
ఇక ఇటీవల ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మల ఫస్ట్ లుక్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాతో వెంకటేష్ మరోసారి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంటాడని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా, నిహారికా ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది.
She is the firebrand in #SAINDHAV‘s Mission ❤️🔥
Revealing ‘Jasmine’ Tomorrow at 11:07 AM 💥⏳
Victory @VenkyMama @Nawazuddin_S @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @vboyanapalli @Music_Santhosh @tkishore555 @NiharikaEnt #Venky75
— Niharika Entertainment (@NiharikaEnt) April 27, 2023