డిల్లీలో ప్రాణం తీసిన కోడి ధర..ఎందుకో తెలుసా 

  • Published By: madhu ,Published On : April 30, 2020 / 06:01 AM IST
డిల్లీలో ప్రాణం తీసిన కోడి ధర..ఎందుకో తెలుసా 

కోడి ధర ప్రాణం తీసింది. మార్కెట్ రేటు కంటే ఎక్కువగా అమ్ముతావా అంటూ నలుగురు వ్యక్తులు వ్యాపారిని అత్యంత దారుణంగా చంపేశారు. ఈ ఘటన ఎక్కడో మారుమూల ప్రాంతంలో చోటు చేసుకోలేదు. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. బతుదెరువు కోసం వచ్చి వ్యాపారం నిర్వహిస్తున్న ఇతడిని చంపేయడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. 

వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి చెందిన షిరాజ్ బతుకు దెరువ కోసం ఢిల్లీలోని జాంగీర్ పూరి కాలనీకి వలస వచ్చి..చేపల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. లాక్ డౌన్ నేపథ్యంలో వ్యాపారం కొనసాగడం కష్టతరంగా మారింది. దీంతో షిరాజ్ ఇంటి వద్దనే ఉంటూ చికెన్ మాంసాన్ని విక్రయించడం ప్రారంభించాడు. చికెన్ కొనుగోలు చేయడానికి షా అలమ్ వచ్చాడు. రేటు ఎంతగనో అడిగాడు. మార్కెట్ ధర కంటే ఎక్కువ విక్రయిస్తున్నావంటూ..అలమ్ వాగ్వాదానికి దిగాడు. 

ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. ఇంతలో అలమ్ సోదరులు వచ్చారు. ఆగ్రహంతో కత్తులు, రాడ్లతో విచక్షణారహితంగా దాడులక పాల్పడ్డారు. షిరాజ్ కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని షిరాజ్ ను ఆసుపత్రికి తరలించారు. మంగోల్ పురిలోని సంజయ్ గాంధ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..చనిపోయాడు. షా ఆలమ్ ను అరెస్టు చేసినట్లు, ఇతరుల కోసం గాలింపులు చేపడుతున్నామని డీసీపీ విజయంత ఆర్య వెల్లడించారు.