Visakhapatnam gas leak:కేంద్రం ప్రొటోకాల్స్ ఉంటేనే రీ ఓపెన్

  • Published By: Subhan ,Published On : May 8, 2020 / 07:08 AM IST
Visakhapatnam gas leak:కేంద్రం ప్రొటోకాల్స్ ఉంటేనే రీ ఓపెన్

కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి సేఫ్టీ ప్రొటోకాల్ లేకుంటే ఎటువంటి యూనిట్లు, ఇండస్టీలు అయినా మూతపడి ఉండాల్సిందే. విశాఖ పట్నంలో నెల రోజులకు పైగా పనిచేయకుండా ఉండిపోయిన యూనిట్‌లో ఒక్కసారిగా ఓపెన్ చేయడంతో ప్రమాదం జరిగింది. దీనిపై ప్రధానమంత్రి కార్యాలయంలో చర్చ జరిగింది. 

సేఫ్టీ ప్రొటోకాల్ క్లియరెన్స్ లేకపోతే ఏ యూనిట్ ఓపెన్ చేయకూడదని.. విశాఖపట్నంలో జరిగిన ఘటన లాంటిది దేశంలో మరెక్కడా జరగకూడదని కేంద్రం నిర్ణయించింది. ఈ ఘటనలో 11మంది చనిపోగా 800మంది హాస్పిటల్ పాలయ్యారు. ఎల్జీ పాలీమర్ నుంచి గ్యాస్ లీకవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. 

Also Read | రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే పాలిమర్ లు నిర్వహించవచ్చు. కేంద్ర మంత్రిత్వ శాఖ జరిగిన ఘటనపై ఇంకా పరిశీలనలు జరపాల్సి ఉంది

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(CPCB) వెంటనే దేశవ్యాప్తంగా అన్ని యూనిట్లు సేఫ్టీ చెక్ నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. Covid-19 వ్యాప్తి అడ్డుకోవడానికి జాతీయవ్యాప్తంగా జరిగిన లాక్‌డౌన్‌లో మార్చి నెల చివరి నుంచి దాదాపు దేశంలోని అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. 

విశాఖపట్నంలో ప్రమాదం జరిగిన తర్వాత LG Polymer అన్ని క్లియరెన్స్ లు పొందిన తర్వాతే రీ ఓపెన్ అయిందా అనే సందేహాలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద అనుమానాలు పెరిగిపోయాయి. కెపాసిటీకి మించిన విస్తరణకు పర్మిషన్ ఎలా ఇచ్చారని కేంద్రం ప్రశ్నిస్తుంది. మాజీ ఫైనాన్స్ సెక్రటరీ ఈఏఎస్ శర్మ నేరుగా ముఖ్యమంత్రిని ఈ ప్రశ్నలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే పాలిమర్ లు నిర్వహించవచ్చు. కేంద్ర మంత్రిత్వ శాఖ జరిగిన ఘటనపై ఇంకా పరిశీలనలు జరపాల్సి ఉంది

Also Read | విశాఖ గ్యాస్ లీక్ ఘటనను సుమోటోగా స్వీకరించిన NHRC