ఒక్క రోజే అమెరికాలో 1635 కరోనా మరణాలు

  • Published By: Subhan ,Published On : May 9, 2020 / 03:11 AM IST
ఒక్క రోజే అమెరికాలో  1635 కరోనా మరణాలు

Updated On : May 9, 2020 / 3:11 AM IST

అగ్రరాజ్యంలో కరోనా మృతుల సంఖ్య మిగిలిన వారికి ముచ్చెమటలు పట్టిస్తుంది. శుక్రవారం ఒక్కరోజులోనే 1635 మంది చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 77వేల 178కి చేరుకుంది. జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ కథనం ప్రకారం.. దేశంపై కరోనా ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. మహమ్మారి ప్రభావానికి గురైన వారి సంఖ్య 12లక్షల 83వేల 829గా గుర్తించారు. 

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ అయిపోయిన అమెరికాను రీఓపెన్ చేయడం ద్వారా ఎక్కువమంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయే అవకాశముందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. సోషల్ డిస్టెన్స్  చర్యలను ఎత్తివేయడం మూసివేసిన ఆర్థిక వ్యవస్థను తిరిగి తెరవడం అధిక మరణాల సంఖ్యకు దారితీస్తుందా అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా…కొన్ని ఉండవచ్చు అని,ఎందుకంటే మీరు ఓ అపార్ట్మెంట్ లేదా ఇంట్లో లేదా మరేదైనా చోట లాక్ చేయబడి ఉండరని అమెరికా అధ్యక్షుడు అన్నారు.కొంతమంది అమెరికన్లు తీవ్రంగా ప్రభావితమవుతారని, అయినప్పటికీ అమెరికాను తిరిగి ఓపెన్ చేయాలని ట్రంప్ అన్నారు. ముందుకుసాగాల్సిన సమయం వచ్చిందని ట్రంప్ అన్నారు.

Read More :

*  Coronavirus, Spanish fluను ఎదిరించిన 107ఏళ్ల మహిళ

క్రికెటర్‌కి కరోనా.. నాకే ఎందుకిలా? అంటూ భావోద్వేగం