ఏపీలో కరోనా @ 2137 : కొత్త కేసులు 48

  • Published By: madhu ,Published On : May 13, 2020 / 06:11 AM IST
ఏపీలో కరోనా @ 2137 : కొత్త కేసులు 48

ఏపీలో మాత్రం కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతోంది. టెస్ట్‌లు పెరుగుతున్నా రోజురోజుకూ కొత్త కేసులు తగ్గిపోతున్నాయి. ఇది.. రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తోంది. వారం క్రితం ప్రతిరోజూ 70-80 కేసులు నమోదవగా..  గత నాలుగైదు రోజులుగా 30-40కి మించి పెరగలేదు.

2020, మే 13వ తేదీ బుధవారం 48 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2 వేల 137 కు చేరుకుంది. కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో వైరస్ బయటపడుతోంది. ఒడిషా 08, మహారాష్ట్ర 38, గుజరాత్ 26, కర్నాటక 01 కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 03, తూర్పుగోదావరి జిల్లాలో 04 కోయంబేడ్ నుంచి వచ్చిన వారిగా వెల్లడించారు. 

ఇప్పటివరకు 1142 మంది డిశ్చార్జ్ కాగా.. 47 మంది మరణించారు. బుధవారం ఒకరు చనిపోయారు. ప్రస్తుతం 948మంది చికిత్స పొందుతున్నారు. కర్నూలు జిల్లాలో 591 కేసులు చేరగా..కృష్ణాలో 349, గుంటూరులో 399 అత్యధికంగా కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.  

జిల్లాల వారీగా : అనంతపురం 118. చిత్తూరు 1421. ఈస్ట్ గోదావరి 51. గుంటూరు 399. కడప 97. కృష్ణా 349. కర్నూలు 591. నెల్లూరు 111. ప్రకాశం 63. శ్రీకాకుళం 05. విశాఖపట్టణం 66. విజయనగరం 04. వెస్ట్ గోదావరి 68. ఇతరులు 73. 

కోవిడ్ పరీక్షలు : గడిచిన 24 గంటల్లో 09 వేల 284 శాంపిల్స్ పరీక్షించగా..48 మందికి పాజిటివ్ ఉందని తేలింది. 

డిశ్చార్జ్ అయిన వివరాలు : గడిచిన 24 గంటల్లో 86 మంది డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది. గుంటూరు 27, కృష్ణా 25, కర్నూలు 13, కడప 10, తూర్పుగోదావరి 04, పశ్చిమ గోదావరి 04, అనంతపూర్, నెల్లూరు, శ్రీకాకుళంలో ఒక్కొక్కరు చొప్పున డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1142కి చేరింది. 

రాష్ట్రంలో కొత్తగా నమోదైన మరణాలు : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో ఒక్కరు చనిపోయారు. కోవిడ్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 47కి పెరిగింది.  

Read More :

ఏపీ వాసులకు గుడ్ న్యూస్..కరోనా తగ్గుముఖం

ఏపీలో కరోనా @ 2051 : కొత్త కేసులు 33. 20 కోయంబేడ్ నుంచి వచ్చినవే