Group-1 Prelims Exam: గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షకు భారీ స్థాయిలో గైర్హాజరైన అభ్యర్థులు.. కారణమేమంటే..

ఈసారి అభ్యర్థుల సంఖ్య అనూహ్యంగా తగ్గింది. రాష్ట్ర స్థాయిలో ఉన్నత ఉద్యోగాన్ని పొందేందుకు మళ్లీ అవకాశం వచ్చినా దాన్ని వేలాదిమంది సద్వినియోగం చేసుకోలేకపోవటం గమనార్హం.

Group-1 Prelims Exam: గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షకు భారీ స్థాయిలో గైర్హాజరైన అభ్యర్థులు.. కారణమేమంటే..

Group-1 Prelims Exam

Group-1 Prelims Exam: తెలంగాణలో ఆదివారం గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి. అయితే, ఈ పరీక్షలకు అభ్యర్థులు భారీ సంఖ్యలో గైర్హాజరు కావటం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఈ పరీక్షలు నిర్వహించింది. మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 3,09,323 మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. కానీ వారిలో పరీక్షలకు కేవలం 2,33,248 మంది అభ్యర్థులు మాత్రమే హాజరైనట్లు టీఎస్‌పీఎస్‌సీ వెల్లడించింది. దాదాపు 1.47లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకాలేదు. భారీ సంఖ్యలో అభ్యర్థులు పరీక్షకు హాజరుకాకపోవటం చర్చనీయాంశంగా మారింది.

JEE Exam Smart Copying : జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ కలకలం.. ఇంటర్‌లో టాపరే కీలక సూత్రదారి..!

గతేడాది అక్టోబర్ 16న గ్రూప్ -1 పరీక్షలు నిర్వహించారు. పేపర్ లీకేజీ కారణంగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను టీఎస్‌పీఎస్‌సీ రద్దు చేసిన విషయం విధితమే. గతేడాది నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షలకు 2.86లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అంటే హాజరుశాతం 79.15శాతం. తాజాగా, ఆదివారం నిర్వహించిన రెండోసారి పరీక్షకు 61.37శాతం మంది మాత్రమే హాజరైనట్లు టీఎస్‌పీఎస్‌సీ ప్రాథమికంగా వెల్లడించింది.

TSPSC Group 1: తెలంగాణలో గ్రూప్ -1 పరీక్షలకు లైన్ క్లియర్

ఈసారి అభ్యర్థుల సంఖ్య అనూహ్యంగా తగ్గింది. రాష్ట్ర స్థాయిలో ఉన్నత ఉద్యోగాన్ని పొందేందుకు మళ్లీ అవకాశం వచ్చినా దాన్ని వేలాదిమంది సద్వినియోగం చేసుకోలేకపోవటం గమనార్హం. ఇదిలాఉంటే.. ఈదఫా ప్రశ్నపత్రం కాస్త కఠినంగానే ఉందని అభ్యర్థులు, నిపుణులు పేర్కొంటున్నారు. యూపీఎస్సీ ప్రమాణాలకు మించి ప్రశ్నలను ఇచ్చినట్లు మరికొందరు అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై నేరుగా జవాబు చెప్పే ప్రశ్నలు అడిగారు. రద్దయిన పరీక్షతో పోలిస్తే కటాఫ్ మార్కులు పెద్దగా పెరగకపోవచ్చునని నిఫుణులు అభిప్రాయ పడుతున్నారు.