Actor Vijay: అంబేద్కర్, పెరియార్ వంటి నాయకులను వీలైనంత ఎక్కువ చదవండి.. విద్యార్థులతో దళపతి విజయ్

విద్యకు ఉన్న శక్తి గురించి ఈ మద్య ఒక డైలాగ్ విన్నాను. ‘మిగతావన్నీ మీ నుంచి దొంగిలిస్తారు, కానీ మీ దగ్గర ఉన్న విద్యను ఎవరూ దొంగింలించలేరు’ అన్న ఆ డైలాగ్ నన్ను కదిలించింది. ఇది వాస్తవం. అందుకే చదువు కోసం ఏదైనా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. దానికి ఇదే సమయం అని నా నమ్మకం

Actor Vijay: అంబేద్కర్, పెరియార్ వంటి నాయకులను వీలైనంత ఎక్కువ చదవండి.. విద్యార్థులతో దళపతి విజయ్

Tamilnadu: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్, ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ రామస్వామి, మద్రాస్ స్టేట్ మాజీ ముఖ్యమంత్రి కామరాజ్ వంటి నాయకుల గురించి వీలైనంత ఎక్కువ చదవాలని విద్యార్థులకు తమిళ హీరో, దళపతి విజయ్ సూచించారు. చెన్నైలో శనివారం 10, 12 తరగతుల్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఆయన సన్మానం చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారన్న అంచనాల నడుమ అంబేద్కర్, పెరియార్, కామరాజ్ వంటి నాయకులను గుర్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Assam flood worsens: కురుస్తున్న భారీవర్షాలు..వరదలతో అసోం అతలాకుతలం

ఇక విద్యార్థులను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతూ ‘‘సాధ్యమైనంత వరకు, ప్రతిదాని గురించి చదవండి. అంబేద్కర్, పెరియార్, కామరాజ్ వంటి నాయకుల గురించి వీలైన ఎక్కువ చదవండి. చదివిన దాని నుంచి ఏది మంచిదో దాన్ని తీసుకోండి, మిగిలింది వదిలివేయండి’’ అని అన్నారు. ఇక విద్యార్థుల పరీక్షల గురించి సలహా ఇస్తూ ‘‘పరీక్షల్లో ఫెయిల్ అయిన మీ స్నేహితులతో మాట్లాడి, వారికి ధైర్యం చెప్పండి. మీకు అవసరమైనవి అందకుండా మిమ్మల్ని నిరుత్సాహపరిచే వారు మీ చుట్టూనే ఉంటారు. అయితే మీ మనసు చెప్పే మాటలు వినండి’’ అని అన్నారు.

Tamilandu Politics: కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీపై ట్విటర్‭లో విమర్శలు.. బీజేపీ జనరల్ సెక్రెటరీ అరెస్ట్

‘‘నా కల సినిమా. ఆ బాటలోనే నా ప్రయాణం సాగింది. అయితే విద్యకు ఉన్న శక్తి గురించి ఈ మద్య ఒక డైలాగ్ విన్నాను. ‘మిగతావన్నీ మీ నుంచి దొంగిలిస్తారు, కానీ మీ దగ్గర ఉన్న విద్యను ఎవరూ దొంగింలించలేరు’ అన్న ఆ డైలాగ్ నన్ను కదిలించింది. ఇది వాస్తవం. అందుకే చదువు కోసం ఏదైనా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. దానికి ఇదే సమయం అని నా నమ్మకం’’ అని అన్నారు.

Adipurush : ఆదిపురుష్ దెబ్బతో పీవీఆర్ ఐనాక్స్ షేర్లు లాస్.. దాదాపు 3 శాతం పైగా..

విజయ్ రాజకీయాలు, ఓట్ల గురించి మాట్లాడారు. ఓటు వేయడం గురించి మాట్లాడుతూ “మీరే భావి ఓటర్లు. రాబోయే రోజుల్లో మంచి నాయకులను ఎన్నుకునేది మీరే. ప్రజలు కూడా ఓటుకు డబ్బు తీసుకుంటున్నారు. ఓటుకు రూ.1,000 ఇస్తున్నారు. అంటే ఒక నియోజకవర్గంలో దాదాపు 1.5 లక్షల మంది ఓటర్లు ఉంటే, దాదాపు 15 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అంత డబ్బు ఖర్చు పెడుతున్నారంటే ఆ వ్యక్తి ఇంతకు ముందు ఎంత సంపాదించాడో ఊహించండి. ఈ విషయాల గురించి ఒక్కసారి ఆలోచించండి. మన విద్యా విధానంలో ఇలాంటివి బోధించబడాలని నేను కోరుకుంటున్నాను” అని విజయ్ అన్నారు.

Manipur Violence: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. అల్లర్లు ఎందుకు ఆగడం లేదు?

విజయ్ త్వరలో రాజకీయ ప్రవేశం చేయాలని యోచిస్తున్నట్లు ఆయనకు సన్నిహిత వర్గాలను నుంచి గుసగుసలు వినిపిస్తున్న సమయంలో విద్యార్థులను సత్కరించడం, వారికి ఓటు గురించి అంబేద్కర్, పెరియార్ వంటి నాయకుల గురించి చర్చ జరగడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికి ఉన్న ఊహాగానాలకు ఆజ్యం పోస్తూ, విజయ్ అభిమానుల సంఘం అయిన ఆల్ ఇండియా దళపతి విజయ్ మక్కల్ ఇయక్కం.. 234లో బూత్ కమిటీలను ఏర్పాటు చేసే పనిలో పడింది.