Tamilandu Politics: కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీపై ట్విటర్‭లో విమర్శలు.. బీజేపీ జనరల్ సెక్రెటరీ అరెస్ట్

ట్విట్టర్ ద్వారా చేసిన ఈ విమర్శలకు గాను సూర్యపై ఐపీసీ సెక్షన్‌లు 153(ఎ), 505 (1)(బి), 505 (1)(సి) ఐటి చట్టంలోని సెక్షన్ 66 (డి) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రస్తుతం రిమాండ్ కోసం మేజిస్ట్రేట్‌కు తరలించారు. అయితే సూర్య అరెస్టుపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై మండిపడ్డారు

Tamilandu Politics: కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీపై ట్విటర్‭లో విమర్శలు.. బీజేపీ జనరల్ సెక్రెటరీ అరెస్ట్

SG Suryah: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నాయకుడు, మధురై ఎంపీ ఎస్.వెంకటేశన్‭పై విమర్శలు చేసినందుకు గాను తమిళనాడు భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రెటరీ ఎస్‌జీ సూర్యను శుక్రవారం అర్థరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. సామాజిక మాధ్యమం ట్విట్టర్ వేదికగా చేసిన విమర్శలకు గాను ఈ యాక్షన్ తీసుకున్నారు. సూర్య ఆ ట్విట్టర్ పోస్ట్‌లో విశ్వనాథన్ అనే సీపీఎంకు చెందిన కౌన్సిలర్ మలంతో నిండిన కాలువను శుభ్రం చేయమని పారిశుధ్య కార్మికుడిని బలవంతం చేశారని ఆరోపించారు. ఫలితంగా అలెర్జీ కారణంగా ఆ కార్మికుడు మరణించాడని అన్నారు.

Adipurush: ఆదిపురుష్ సినిమా కాంట్రవర్సీలోకి మహా సీఎంను లాగిన నెటిజెన్.. ఫోన్ నంబర్ షేర్ చేయమంటూ ఝలక్ ఇచ్చిన థానే పోలీస్

అయితే దీనిపై ఎంపీ వెంకటేశన్ మౌనం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ట్వీట్ లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. వెంకటేశన్‌ను ఉద్దేశించి తమిళంలో రాసిన ట్వీట్‌లో “కమ్యూనిస్ట్ కౌన్సిలర్ కారణంగా పారిశుధ్య కార్మికుడి ప్రాణాలు కోల్పోయారు. బూటకపు మౌనం వహించే మధురై ఎంపీ ఎస్.వెంకటేశన్! మీ వేర్పాటువాద రాజకీయాలు ఆ మురికి గుంట కంటే దారుణంగా కంపు కొడుతున్నాయి. మనిషిగా జీవించడానికి ఒక మార్గాన్ని వెతుక్కోండి!” అని ట్వీట్ చేశారు.

Donald Trump : అందరి బిల్లు నేనే చెల్లిస్తానని చెప్పి హోటల్ బిల్లు కట్టకుండా ఎస్కేప్ అయిన ట్రంప్.!

కాగా, ట్విట్టర్ ద్వారా చేసిన ఈ విమర్శలకు గాను సూర్యపై ఐపీసీ సెక్షన్‌లు 153(ఎ), 505 (1)(బి), 505 (1)(సి) ఐటి చట్టంలోని సెక్షన్ 66 (డి) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రస్తుతం రిమాండ్ కోసం మేజిస్ట్రేట్‌కు తరలించారు. అయితే సూర్య అరెస్టుపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై మండిపడ్డారు. ట్విటర్‌ వేదికగా ఆయన స్పందిస్తూ “తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌జీ సూర్యను రాత్రికి రాత్రే అరెస్టు చేయడం అత్యంత ఖండించదగినది. డీఎంకే మిత్రపక్షాలైన కమ్యూనిస్టుల దుష్ట ద్వంద్వ ప్రమాణాలను బహిర్గతం చేయడమే ఆయన చేసిన తప్పు’’ అని ట్వీట్ చేశారు.