Godhra Riots : గోద్రా అల్లర్లకు సంబంధించిన నాలుగు కేసుల్లో.. మరో 35 మందిని నిర్దోషులుగా ప్రకటించిన గుజరాత్ కోర్టు

ఈ అల్లర్లలో ముగ్గురిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సమర్పించడంలో పోలీసులు విఫలమైనట్లు కోర్టు వెల్లడించింది.

Godhra Riots : గోద్రా అల్లర్లకు సంబంధించిన నాలుగు కేసుల్లో.. మరో 35 మందిని నిర్దోషులుగా ప్రకటించిన గుజరాత్ కోర్టు

Gujarat Court

Gujarat Court : గోద్రా అల్లర్లకు సంబంధించిన నాలుగు కేసుల్లో నిందితులైన మరో 35 మందిని గుజరాత్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. గోద్రా అల్లర్లు ప్రణాళిక ప్రకారం జురుగలేదని తెలిపింది. నాలుగు కేసులకు సంబంధించి 52మంది వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. అయితే ఈ కేసుల విచారణ సమయంలో 17మంది మరణించారు. దీంతో మిగిలిన 35 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ పంచమహల్ జిల్లాలోని హలోల్ పట్టణంలోని కోర్టు తీర్పు ఇచ్చింది.

21ఏళ్ల క్రితం జరిగిన గోద్రా అల్లర్లకు సంబంధించిన నాలుగు కేసుల విచారణ ముగిసింది. ఈ అల్లర్లలో ముగ్గురిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సమర్పించడంలో పోలీసులు విఫలమైనట్లు కోర్టు వెల్లడించింది. జూన్ 12న రిజర్వ్ చేసిన తీర్పును గురువారం వెల్లడించింది.

Minister Harish Rao : కిషన్ రెడ్డికి కన్ఫ్యూషన్ ఎక్కువ.. కాన్సంట్రేషన్ తక్కువ : మంత్రి హరీష్ రావు

గోద్రా అల్లర్లు ప్రణాళికాబద్దంగా జరిగినట్లు రాజకీయ నేతలు, మీడియా చేసిన ఆరోపణలను కోర్టు తప్పు పట్టింది. ఈ కేసుల విచారణలో ఇది నిర్ధారణ కాలేదని వెల్లడించింది. నిందితుల నుంచి మారణ ఆయుధాలు స్వాధీనం చేసుకోలేదని, వారికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్లు ఆరోపించింది.