Modi-Biden Meet : బైడెన్‌తో.. మోదీ ఏం చర్చించబోతున్నారు? ప్రపంచ దేశాల దృష్టి అంతా వీరి భేటీ మీదే..!

ప్రపంచ దేశాల అటెన్షన్ అంతా మోదీ, జో బైడెన్ భేటీ మీదే ఉంది. వైట్ హౌజ్ వేదికగా.. ఈ వీరు ఏయే అంశాలపై చర్చించబోతున్నారు? ఏయే ఒప్పందాలపై సంతకాలు చేయబోతున్నారు?

Modi-Biden Meet : బైడెన్‌తో.. మోదీ ఏం చర్చించబోతున్నారు? ప్రపంచ దేశాల దృష్టి అంతా వీరి భేటీ మీదే..!

PM Modi America Tour

Inida PM Modi- us president Biden Meet : భారత ప్రధాని నరేంద్రమోదీ (Inida PM Modi)అమెరికా పర్యటన (us tour)ఆసక్తికరంగా మారింది.. చాలా నెలల తర్వాత.. మోదీ అమెరికా(Americe)లో జూన్ 20న అడుగు పెట్టబోతున్నారు. అగ్రరాజ్యంతో రక్షణ-పారిశ్రామిక సహకారంలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసేందుకు మోదీ టూర్ ఉపయోగపడుతుందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా.. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్‌తో.. ప్రధాని మోదీ ఐదు కీలక రంగాలపై చర్చలు జరపనున్నారు. అలాగే వ్యూహాత్మక అంశాలపైనా కూడా మోదీ చర్చించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రధాని అమెరికా టూర్.. ఇండియాకి టర్నింగ్ పాయింట్ కాబోతోందా? మోదీ విజిట్ తర్వాత.. రెండు దేశాల మధ్య పరస్పర సహకారం మరింత బలపడనుందా?

ఇప్పుడు ప్రపంచ దేశాల అటెన్షన్ మోదీ, జో బైడెన్ భేటీ (Modi, Biden Meet)మీదే ఉంది. వైట్ హౌజ్ (white house)వేదికగా.. ఏయే అంశాలపై చర్చించబోతున్నారు? ఏయే ఒప్పందాలపై సంతకాలు చేయబోతున్నారు? భారత్-అమెరికా బంధం (India-US relationship)ఏ మేరకు బలపడనుందనే చర్చ ఊపందుకుంది. ప్రధానంగా.. ఆరోగ్యం, టెక్నాలజీ, పునర్వినియోగ ఇంధనం, విద్య, రక్షణ రంగాల్లో పరస్పర సహకారంపై.. ప్రధాని మోదీ, యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ చర్చించనున్నారు. రెండు దేశాల సంయుక్త ప్రకటనలో ఈ అంశాలకు చోటు దక్కనుంది. అమెరికాలో భారత రాయబారి తరన్‌జిత్‌ సింగ్‌ సంధు (Taranjit Singh Sandhu) ఈ వివరాలను తెలియజేశారు.

సాంకేతికత.. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ కీలకంగా మారిన అంశం. ప్రస్తుతం.. టెక్నాలజీ అనేది.. వ్యాపారపరంగానే కాదు వ్యూహాత్మక అంశాల్లోనూ అత్యంత కీలకంగా ఉంది. అందువల్ల.. టెక్నాలజీ షేరింగ్, భాగస్వామ్యంలో నమ్మకం, విశ్వాసంతో పనిచేయడం మీదే.. మోదీ, బైడెన్ (Modi, Biden)మధ్య చర్చలు జరుగుతాయి. ఇక.. డిజిటల్‌ స్టార్టప్‌ ఇన్నోవేషన్లు (Digital Startup Innovations)కూడా ఇద్దరి మధ్య చర్చల్లో భాగమవుతాయ్. అందుబాటు ధరల్లో చికిత్సలు(Treatments), మందులు(Medicines), వ్యాక్సిన్లు (vaccines), ట్రైనింగ్ (training), రీసెర్చ్ (research)లాంటి వాటిపై.. ఇద్దరు అగ్ర నేతలు చర్చిస్తారు. ఇక.. సోలార్ పవర్ (Solar power), బ్యాటరీ టెక్నాలజీ(battery technology), హైడ్రోజన్ ఇంధనం ( hydrogen fuel)లాంటివి కూడా చర్చకు రానున్నాయి. ముఖ్యంగా.. విద్యలో విజ్ఞాన భాగస్వామ్యంపైనా చర్చించనున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం అమెరికా (america)లో 2 లక్షల మంది భారతీయ విద్యార్థులు (Indian students)చదువుకుంటున్నారు. వాళ్లందరినీ లింక్ చేయడం, రెండు దేశాల క్యాంపస్‌ల మధ్య సంబంధాలను పెంచడంపైనా ప్రధాని మోదీ (PM Modi)చర్చించనున్నారు.

PM Modi US Visit: ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో.. ఏ సమయానికి ఏ కార్యక్రమంలో పాల్గొంటారు.. పూర్తి షెడ్యూల్ ఇలా..

ఇక.. రక్షణ రంగ టెక్నాలజీ(Defense Technology)లో అమెరికా దిగ్గజమని చెప్పొచ్చు. ఈ రంగంలో.. భారత్ ఇప్పుడిప్పుడే.. ఒక్కో మెట్టు ఎదుగుతోంది. డిఫెన్స్ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగానూ.. ప్రధాని మోదీ, ప్రెసిడెంట్ బైడెన్ మధ్య చర్చలు జరగనున్నాయి. గతంలో.. ఈ డిఫెన్స్ సెక్టార్‌లో.. ఆయుధాల అమ్మకాలు, కొనుగోలు లాంటి వ్యాపార సంబంధాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు.. టెక్నాలజీ షేరింగ్‌‍తో పాటు సంయుక్తంగా ఆయుధాల ఉత్పత్తి, అభివృద్ధి దిశగా.. రెండు దేశాలు సాగేలా చర్చలు జరగనున్నాయి. వీటితో పాటు రెండు దేశాల అభివృద్ధికి, సహకారానికి సంబంధించి.. మరిన్ని కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, అంతరిక్ష రంగం, క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ రంగాల్లో.. భారత్‌కు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని అందించేందుకు అడ్డుగా ఉన్న ఆంక్షలను.. అమెరికా ఎత్తివేసే అవకాశం ఉందంటున్నారు అంతర్జాతీయ నిపుణులు.

ఆర్థిక మాంద్యం (Economic recession), యుక్రెయిన్-రష్యా యుద్ధం (Ukraine-Russia war) లాంటి అంశాలు కూడా మోదీ-బైడెన్ మధ్య చర్చకు వచ్చే చాన్స్ ఉంది. దాంతో.. ఇద్దరు అగ్ర నేతల భేటీపై.. ప్రపంచ దేశాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా.. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపైనా చర్చలు జరపనున్నారు. రెండు దేశాల మధ్య డిఫెన్స్ ట్రేడ్, హై-టెక్ ట్రేడ్, పెట్టుబడుల్లో ఉన్న అడ్డంకులను తొలగించడానికి.. మోదీ, బైడెన్ భేటీతో రూట్ క్లియర్ అవుతుందని చెబుతున్నారు. ఇక.. క్లీన్ ఎనర్జీ ట్రాన్స్‌ఫర్మేషన్‌(clean energy transformation)లో అగ్రగామిగా ఉండటానికి, గ్లోబల్ సెమీకండక్టర్స్ (Global Semiconductors), ఇతర కీలక వస్తువుల సప్లై చైన్‌ విస్తరించడానికి.. ఏఐ, అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్, బయోటెక్ అండ్ క్వాంటమ్‌లో రెవల్యూషన్‌ సృష్టించేందుకు.. యూఎస్-భారత్ సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు.


ఇప్పటికే కృత్రిమ మేధస్సు (AI), సెమీ కండక్టర్స్(Semi conductors), టెలీకమ్యూనికేషన్స్(Telecommunications), డిఫెన్స్ అండ్ స్పేస్ (Defense and Space), క్వాంటమ్‌ కంప్యూటింగ్ (Quantum Computing) లాంటి రంగాల్లో సహకారాన్ని ప్రోత్సహించేందుకు.. గతేడాది టోక్యో వేదికగా ప్రధాని మోదీ, జో బైడెన్ సమావేశమయ్యారు. అప్పుడు.. క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ.. ఐసెట్ ఏర్పాటుకు కృషి చేశారు. ఇందులో భాగంగా.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారుచేసే యుద్ధ విమానాలలు శక్తినిచ్చే ఇంజిన్‌లను.. భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు.. జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీకి అమెరికా ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. వైట్‌హౌస్‌లో జరిగే భేటీలో రెండు దేశాల అధినేతలు.. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశముంది. ఇక.. యూఎస్ నుంచి భారత్‌కు.. హై-పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ టెక్నాలజీ, సోర్స్ కోడ్‌‌ను ఎగుమతి చేయడంలో ఉండే అడ్డంకులను తగ్గించడానికి బైడెన్ అడ్మినిస్ట్రేషన్.. అమెరికన్ కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తున్నట్లు సమాచారం. సెమీకండక్టర్ల తయారీకి సంబంధించి ఉమ్మడి ప్రాజెక్టులు, సాంకేతిక భాగస్వామ్యాలకు మార్గం సుగమం చేసే ఎంవోయూపై.. ఈ ఏడాది ప్రారంభంలో రెండు దేశాలు సంతకం చేశాయి. ప్రధాని మోదీ తన పర్యటనలో.. వివిధ కంపెనీల సీఈవోలు, అమెరికా ప్రముఖులతోనూ సమావేశం కానున్నారు.