Golden Temple Gurbani: స్వర్ణ దేవాలయం గుర్బానీ వివాదం.. చట్ట సవరణ చేస్తామని సీఎం సంచలన ప్రకటన.. జోక్యం చేసుకుంటే బాగుండదని సిక్కు సంఘం వార్నింగ్

భగవంతుడి ఆశీస్సులతో మేం చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతున్నాము. చాలా కాలంగా భక్తుల నుంచి వస్తున్న డిమాండ్లకు అనుగుణంగా సిక్కు గురుద్వారా చట్టానికి కొత్తగా ఒక క్లాజ్ చేర్చబోతున్నాం. దీనిద్వారా స్వర్ణదేవాలయానికి చెందిన గుర్బానీ అందరికీ ఉచితంగా అందుబాటులోకి వస్తుంది.

Golden Temple Gurbani: స్వర్ణ దేవాలయం గుర్బానీ వివాదం.. చట్ట సవరణ చేస్తామని సీఎం సంచలన ప్రకటన.. జోక్యం చేసుకుంటే బాగుండదని సిక్కు సంఘం వార్నింగ్

Punjab: అమృత్‭సర్‭లోని స్వర్ణ దేవాలయం నుంచి వచ్చ గుర్బానీ అంశంపై పంజాబ్‭లో రాజకీయ దుమారం లేసింది. గుర్బానీపై చట్ట సవరణ చేస్తామని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చేసిన ప్రకటనే ఈ వివాదానికి కారణమైంది. ముఖ్యమంత్రి ప్రకటనపై శిరోమణి గురుద్వార పర్భందక్ కమిటీ (ఎస్జీపీసీ) తీవ్ర స్థాయిలో మండిపడింది. గుర్బానీ అంశాన్ని ఎస్జీపీసీ చూసుకుంటుందని, ప్రభుత్వానికి ఇందులో తలదూర్చే హక్కు లేదని హెచ్చరించింది. ఇక మాన్ ప్రకటనపై రాజకీయ విపక్షాలు సైతం విమర్శలు గుప్పిస్తున్నాయి.

Kedarnath : కేదార్‌నాథ్‌ మందిరం స్వర్ణ తాపడంలో రూ.125 కోట్ల కుంభకోణం..! కలకలం రేపుతున్న పూజారి ఆరోపణలు

విషయం ఏంటంటే.. గుర్బానీ అనేది పంజాబీలకు ఒక పవిత్రమైన శ్లోకం. స్వర్ణ దేవాలయంలో పఠించే ఈ శ్లోకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు ఎంతో భక్తితో వింటుంటారు. అయితే గుర్బానీ ప్రసార హక్కులు పీటీసీ అనే ప్రైవేట్ ఛానల్‭కు అప్పట్లో కట్టబెట్టారు. అయితే గుర్బానీని అందరికీ అందుబాటులో ఉండేలా ఉచితంగా ప్రసారం చేస్తామని ప్రకటించారు. దీనికి అనుగుణంగా గురుద్వారా-1925 చట్టాన్ని సవరిస్తామని ముఖ్యమంత్రి మాన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీనిపై తీర్మానం చేసి మంగళవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

PM Modi US Visit: ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో.. ఏ సమయానికి ఏ కార్యక్రమంలో పాల్గొంటారు.. పూర్తి షెడ్యూల్ ఇలా..

దీనిపై ఆదివారం మాన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘భగవంతుడి ఆశీస్సులతో మేం చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతున్నాము. చాలా కాలంగా భక్తుల నుంచి వస్తున్న డిమాండ్లకు అనుగుణంగా సిక్కు గురుద్వారా చట్టానికి కొత్తగా ఒక క్లాజ్ చేర్చబోతున్నాం. దీనిద్వారా స్వర్ణదేవాలయానికి చెందిన గుర్బానీ అందరికీ ఉచితంగా అందుబాటులోకి వస్తుంది. దీనిపై కేబినెట్ నిర్ణయం తీసుకుంటాం. ఇక జూన్ 20న అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఓటింగ్ నిర్వహిస్తాం’’ అని ట్వీట్ చేశారు.

Pawan Kalyan : జనసేనాని వారాహి యాత్ర.. పవన్ కళ్యాణ్ షెడ్యూల్ లో మార్పులు

సీఎం మాన్ చేసిన ఈ ప్రకటనపై పంజాబ్‭లో రాజకీయ దుమారం లేసింది. ఈ విషయమై శిరోమణి గురుద్వార పర్భందక్ కమిటీ అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామి స్పందిస్తూ ‘‘ఈ విషయంలో పంజాబ్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. అసలు ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదు కూడా. వాళ్లు (ఆప్ ప్రభుత్వం) దీన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారు. మేం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలకు దిగొద్దని సీఎం భగవంత్ మాన్‭ను కోరుతున్నాం’’ అని అన్నారు. ఈ తీరు రాజ్యాంగ విరుద్దమని, మతపరమైన అంశాల్లో ప్రత్యక్ష జోక్యమని విమర్శిస్తున్నారు.

Nepal Floods : నేపాల్ ను ముంచెత్తిన వరదలు.. 5 మంది మృతి, మరో 28 మంది గల్లంతు

సిక్కు గురుద్వారా చట్టాన్ని పార్లమెంట్ చేసిందని, దానిలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేయలేదని భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు గుప్పించాయి. వాస్తవానికి గుర్బానీ హక్కుల్ని రాజకీయంగా శక్తివంతమైన బాదల్ కుటుంబానికి ఎస్జీపీసీ కట్టబెట్టింది. అయితే పీటీసీ గుత్తాధిపత్యాన్ని నియంత్రించేందుకే ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తాజా నిర్ణయం తీసుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.