Pawan Kalyan : జనసేనాని వారాహి యాత్ర.. పవన్ కళ్యాణ్ షెడ్యూల్ లో మార్పులు

జూన్22న పవన్ కళ్యాణ్ అమలాపురంలో జనవాణి ఏర్పాటు చేయనున్నారు. జూన్23న అమలాపురంలో వారాహి బహిరంగ సభ ఉంటుంది.

Pawan Kalyan : జనసేనాని వారాహి యాత్ర.. పవన్ కళ్యాణ్ షెడ్యూల్ లో మార్పులు

Pawan Kalyan (1)

Updated On : June 19, 2023 / 4:31 PM IST

Pawan Kalyan Schedule Changes : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర (varahi vijaya yatra)చేపట్టిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో పవన్ వారాహి యాత్ర సాగుతోంది. అయితే, పవన్ కళ్యాణ్ షెడ్యూల్ లో మార్పులు చేశారు. పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం కాకినాడ నుంచి ముమ్మిడివరం వెళ్లనున్నారు.

జూన్ 21న ముమ్మిడివరంలో పవన్ ఉదయం జనవాణి, సాయంత్రం బహిరంగ సభ నిర్వహించనున్నారు. జూన్ 22న పవన్ కళ్యాణ్ అమలాపురంలో జనవాణి ఏర్పాటు చేయనున్నారు. జూన్ 23న అమలాపురంలో వారాహి బహిరంగ సభ ఉంటుంది. అలాగే, జూన్ 24, జూన్ 25న పి గన్నవరం, రాజోలులో పవన్ వారాహి యాత్ర నిర్వహించనున్నారు. జూన్ 25న రాజోలు నియోజకవర్గం మలికిపురంలో బహిరంగ సభ జరగనుంది.

Dwarampudi Chandrasekhar : పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ వ్యభిచారి.. ఎమ్మెల్యే ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం కాకినాడలో ఉన్న పవన్ కల్యాణ్.. స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సకలం దోచేస్తూ.. గూండాగిరి చేస్తున్న ద్వారంపూడి పతనం మొదలైందని హెచ్చరించారు. ద్వారంపూడి రేషన్ బియ్యం మాఫియా ద్వారా రూ.15 వేల కోట్లు కూడబెట్టారని ఆరోపించారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని మళ్లీ గెలవనీయకుండా చూస్తామన్నారు. జగన్ ప్రభుత్వ అవినీతి, ద్వారంపూడి అరాచకాలపై ఆన్ లైన్ వేదికగా యుద్ధం ప్రకటించారు. మహిళల అక్రమ రవాణాకు రాష్ట్రం ప్రధాన కేంద్రంగా మారిందని పవన్ కల్యాణ్ విమర్శించారు.