Thiruvananthapuram : నీటి అడుగున యోగా .. అబ్బురపరుస్తున్న ఇండియన్ ఆర్మీ ప్రదర్శన

ప్రపంచం మొత్తం 9 వ 'అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని' జరుపుకుంటోంది. అనేకమంది యోగా చేస్తున్న ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో షేర్ చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ సిబ్బంది నీటి అడుగున చేసిన యోగా ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది.

Thiruvananthapuram : నీటి అడుగున యోగా .. అబ్బురపరుస్తున్న ఇండియన్ ఆర్మీ ప్రదర్శన

Thiruvananthapuram

Thiruvananthapuram : 9 వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ ఆర్మీ నీటి అడుగున యోగా ప్రదర్శించారు. 91 ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్‌కు చెందిన సిబ్బంది యోగా ప్రదర్శనకి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

International Yoga Day 2023 : సంప్రదాయ పడికట్టుతో చీరలు ధరించిన మహిళలు యోగా..

ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా అనేక చోట్ల సెలబ్రిటీలు, సామాన్యులు యోగా చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. భారతీయ ఆర్మీ సిబ్బంది సైతం నీటి అడుగున యోగా చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. 9 వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరువనంతపురంలో ఇండియన్ ఆర్మీ సిబ్బంది నీటి అడుగున యోగా చేశారు. 91 ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్‌కు చెందిన సిబ్బంది నీటిలో నిల్చున్నట్లు చూపిస్తూ వీడియో మొదలైంది. తర్వాత నీటి అడుగున సిబ్బంది పలు రకాల ఆసనాలు వేసారు. కొన్ని సెకండ్లలో తిరిగి మెల్లగా పైకి వచ్చారు. ఈ వీడియోపై చాలామంది నెటిజన్లు కామెంట్లు పెట్టారు.

Beer Yoga : ‘బీర్ యోగా’ కొత్త ట్రెండ్‌పై మండిపడుతున్న భారతీయులు

యోగాలో పలురకాల వ్యాయామాలు, భంగిమలు, ధ్యానం వంటివి ఉంటాయి. శారీరకంగా, మానసికంగా,ఆధ్యాత్మికంగా మనిషి క్రమశిక్షణగా మెలగడానికి యోగా సహకరిస్తుంది. యోగాని అంతర్జాతీయంగా గుర్తించాలని 2014 లో భారత ప్రధాని మోదీ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి ప్రతిపాదన చేశారు. ఈరోజు ప్రపంచం మొత్తం 9 వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటోంది.