Heart Health : గుండె ఆరోగ్యం కోసం వైద్యులు తప్పనిసరిగా అనుసరించాల్సిన మార్గాలు !

అధిక రక్తపోటు, గుండె జబ్బులకు సంబంధించిన ఇతర ప్రమాద కారకాలు ఒత్తిడికి కారణంగా మరింత తీవ్రతరమౌతాయి. ఎక్కువ పని గంటలు, రోగులకు క్లిష్టమైన పరిస్ధితిలో చకిత్స అందించటం, వంటివి వైద్యులకు ఒత్తిడి కలిగిస్తాయి. దీనితోడు ధూమపానం, మద్యం అలవాటు చేసుకుంటారు.

Heart Health : గుండె ఆరోగ్యం కోసం వైద్యులు తప్పనిసరిగా అనుసరించాల్సిన మార్గాలు !

heart health

Doctors Heart Health : వైద్యులు వారి వైద్య నైపుణ్యం ,సేవా స్ఫూర్తితో లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతారు. అయితే తమ ఆరోగ్యం గురించి మాత్రం అశ్రద్ధ వహిస్తుంటారు. ఎక్కువ గంటలు ఒత్తిడితో కూడిన పరిస్థితులలో స్వంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. వారి సొంత ఆరోగ్యం కంటే రోగుల ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఒత్తిడి , నిశ్చల జీవనశైలి హృదయ సంబంధ వ్యాధులకు ప్రమాద కారకాలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా గుండెపోటు వంటి వాటిని నిరోధించడానికి వైద్యులు గుండె ఆరోగ్యం కోసం తగిన జీవనశైలి మార్పులను చేసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్ చెక్-అప్, సమతుల్య ఆహారం, వ్యాయామం, ఒత్తిడిని అధిగమించే మార్గాలను అనుసరిస్తూ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

READ ALSO : Heart Attack : కార్డియాక్ అరెస్ట్ , గుండెపోటుకు ప్రమాద కారకాలు, లక్షణాలు , నివారణ !

అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ వంటి ప్రమాద కారకాలతో పాటు ఒత్తిడి, నిశ్చల జీవనశైలి, క్రమరహిత ఆహారపు అలవాట్ల కారణంగా వైద్యులకు సైతం గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రాణాంతక పరిస్ధితుల్లో ఉన్న రోగిని కాపాడేందుకు వ్యవహరించే సమయంలో కలిగే ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం , తదిరత కారణాల వల్ల ఇటీవలి కాలంలో తరుచు వైద్యులు సైతం గుండెపోటు పరిస్ధితులను ఎదుర్కోంటున్నారు. ప్రతి వైద్యుడు తప్పనిసరిగా జీవనశైలి మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

1. రెగ్యులర్ చెకప్ ; గుండెపోటులు అకస్మాత్తుగా సంభవిస్తాయి. కానీ గుండె జబ్బులకు కారకాలు సంవత్సరాలుగా శరీరంలో నిశ్శబ్దంగా అభివృద్ధి చెందుతాయి. ప్రతి వైద్యుడు సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం ద్వారా ముందుగానే వాటిని తెలుసుకోవాలి. రక్తపోటు, చక్కెర మరియు కొలెస్ట్రాల్ పర్యవేక్షణ మాత్రమే కాకుండా, TMT పరీక్ష కూడా చేయించుకోవాలి.

2. తినవలసిన ఆహారాలు ; వైద్య నిపుణులందరూ ఆహారం తీసుకునే విషయంలో శిక్షణ పొందే ఉంటారు. వారు ఇంట్లో వీటిని అనుసరిస్తున్నప్పటికీ కొన్ని సమయాల్లో జంక్ ఫుడ్ లు తీసుకుంటుంటారు. అలాంటి ఆహారాలను పరిమితంగా తీసుకోవాలి.

READ ALSO : Prevent Heart Attack : గుండెపోటును నివారించాలంటే ముందుగా ప్రమాద కారకాలను తెలుసుకోండి !

3. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది ; OPD క్లినిక్‌లలో ఎక్కువ గంటలు రోగులను చూసేందుకు కోర్చోవటం వల్ల శరీరంలో కొవ్వు, బరువు పెరగవచ్చు. కాలు నాళాలలో గడ్డకట్టడానికి దారితీస్తుంది. ఈ రకమైన రోజువారీ దినచర్య కారణంగా అధిక రక్తపోటు, టైప్ 2 డయాబెటిస్, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ మొదలైన వాటికి దారి తీస్తుంది. వైద్యులు రోగులను చూస్తున్న సందర్భంలోనే మధ్యమధ్యలో కొంత విరామం ఇచ్చి అటు ఇటు నడవాలి.

4. శారీరక శ్రమ తప్పనిసరి ; రోజువారి శారీరక శ్రమ ,బరువు కోల్పోవడం, ఫిట్‌నెస్‌ను మెరుగుపరచడం. చెడు LDL కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించి మంచి HDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడం అధిక రక్తపోటు , చక్కెర స్థాయిలను నియంత్రించడం వంటి వివిధ ప్రమాద కారకాలను తగ్గించుకోవాలి.

READ ALSOHigh Cholesterol : గుండెను కాపాడుకోవటానికి ఈ విషయాలు గుర్తుంచుకోండి !

5 ఒత్తిడి నిర్వహణ ; అధిక రక్తపోటు, గుండె జబ్బులకు సంబంధించిన ఇతర ప్రమాద కారకాలు ఒత్తిడికి కారణంగా మరింత తీవ్రతరమౌతాయి. ఎక్కువ పని గంటలు, రోగులకు క్లిష్టమైన పరిస్ధితిలో చకిత్స అందించటం, వంటివి వైద్యులకు ఒత్తిడి కలిగిస్తాయి. దీనితోడు ధూమపానం, మద్యం అలవాటు చేసుకుంటారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపకపోవటం వల్ల ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఒక వైద్యుడు ఏదైనా అసౌకర్యంతో బాధపడుతుంటే తనకంటే సీనయారీటీ కలిగిన వైద్యులను సంప్రదించాలి.

6. ధూమపానం మానేయండి ; ధూమపానం గుండె జబ్బులు , గుండెపోటు అవకాశాలను పెంచుతుంది. అదే సమయంలో ఇతర గుండె జబ్బుల ప్రమాద కారకాలను కూడా కారణమవుతుంది. ధూమపానం మానేయడంలో సహాయపడే ప్రణాళికలను అనుసరించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

READ ALSO : Gas Problem : సాధారణ కడుపు నొప్పిని నిర్లక్ష్యం చేయకండి? గ్యాస్ సమస్య గుండెపోటుకు దారితీసే ప్రమాదం

7. నిద్ర , హృదయనాళ ఆరోగ్యం ; గుండె, రక్త నాళాల వైద్యం , పునరుత్పత్తికి నిద్ర సహాయం చేస్తుంది. ఇది హార్మోన్ల ఆరోగ్యకరమైన సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. కణజాలం మరియు అవయవాల ఆరోగ్యకరమైన పెరుగుదల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.