Animal : ‘యానిమల్’ కొత్త రిలీజ్ డేట్.. సందీప్ వంగా రణబీర్ కపూర్ మాస్ యుఫోరియా ఆ రోజే..

యానిమల్ సినిమాని ఆగస్టు 11న రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు. కానీ పలు కారణాలతో ఈ సినిమా వాయిదా పడింది. ప్రస్తుతం యానిమల్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

Animal : ‘యానిమల్’ కొత్త రిలీజ్ డేట్.. సందీప్ వంగా రణబీర్ కపూర్ మాస్ యుఫోరియా ఆ రోజే..

Sandeep Vanga Ranbir Kapoor Animal Movie New Releasing date announced

Sandeep Vanga :  డైరెక్టర్ సందీప్ వంగ అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయిపోయి బాలీవుడ్ వెళ్లి అక్కడ ఇదే సినిమాని కబీర్ సింగ్ గా తీసి హిట్ కొట్టి బాలీవుడ్ లో సెటిలైపోయాడు. ప్రస్తుతం సందీప్ వంగ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. రష్మిక మందన్న యానిమల్ సినిమాలో హీరోయిన్ గా చేస్తుండగా ఇందులో చాలా మంది బాలీవుడ్ స్టార్లు నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమాని భూషణ్ కుమార్ నిర్మాణంలో బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ టీ సిరీస్ నిర్మిస్తుంది.

యానిమల్ సినిమాని ఆగస్టు 11న రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు. కానీ పలు కారణాలతో ఈ సినిమా వాయిదా పడింది. ప్రస్తుతం యానిమల్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి ఓ ప్రీ టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో రణబీర్ గొడ్డలి పట్టుకొని విలన్ మనుషులని నరకడాన్ని చూపించారు. ఈ సినిమాపై బాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

Skanda : బోయపాటి రామ్ మాస్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ రిలీజ్..

ఈ సినిమా గురించి డైరెక్టర్ సందీప్ వంగ ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మాట్లాడుతూ.. యానిమల్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కి టైం పడుతుంది. సినిమాలో 7 పాటలు ఉన్నాయి. అవన్నీ కూడా పాన్ ఇండియా అయిదు భాషల్లో వర్క్ చేయాలి. అందుకే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కి ఇంకా టైం పడుతుంది. ప్రీ టీజర్ కి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఈ సినిమాని డిసెంబర్ 1 విడుదల చేస్తాం. థియేటర్స్ కి వచ్చి చూడండి అని తెలిపాడు. దీంతో యానిమల్ సినిమా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అవ్వనందున ఆగస్టు నుంచి వాయిదా వేసి డిసెంబర్ 1న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాతో సందీప్ బాలీవుడ్ లో ఇంకే రేంజ్ లో సంచలనం సృష్టిస్తాడో చూడాలి.