varieties of Warangal Kandi : రైతులకు అందుబాటులో నూతన వరంగల్ కంది రకాలు.. తక్కువ సమయంలోనే అధిక దిగుబడి

కందిని అన్ని రకాలు నేలల్లో సాగు చేసుకోవచ్చు. అయితే ఖరీఫ్‌లో ఇప్పటివరకు రైతులు కందిలో మధ్యకాలిక రకాలను సాగు చేస్తూ.. వచ్చారు. దీంతో పంట చివరి దశలో బెట్ట పరిస్థితుల మూలంగా దిగుబడులు తగ్గి.. రైతులు నష్టపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మద్యస్థ స్వల్పకాలిక రకాలకు రూపొందించారు.

varieties of Warangal Kandi : రైతులకు అందుబాటులో నూతన వరంగల్ కంది రకాలు.. తక్కువ సమయంలోనే అధిక దిగుబడి

Toor Dal Farming

varieties of Warangal Kandi : అపరాల పంటల్లో ముఖ్యమైన పంట కంది. ఖరీఫ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏక పంటగాను, అంతర పంటగాను అధిక విస్తీర్ణంలో రైతులు సాగుచేస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో జూన్ నుండి జులై 15 వరకు ఖరీఫ్ కందిని విత్తుకోవచ్చు.

READ ALSO : Mahua Flower : గిరిజనులకు కల్పతరువుగా ఇప్పపువ్వు.. ఉప ఉత్పత్తులతో ఉపాధి పొందుతున్న మహిళలు

అయితే ఖరీఫ్‌ సాగుకు అనువైన మధ్య స్వల్పకాలిక నూతన కంది రకాలను వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వారు రూపొందించి.. రైతులకు అందుబాటులోకి ఉంచారు. వాటి గుణగణాలే ఏంటో ఇప్పుడు చూద్దాం..

READ ALSO : Redgram Varieties : ఖరీఫ్ కు అనువైన కంది రకాలు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం

పప్పుదినుసు పంటల్లో అతి ప్రధానమైన కంది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 8లక్షల ఎకరాల్లో కంది సాగవుతుంది. దీనిని ఖరీఫ్‌లో వర్షాధారపు పంటగాను, రబీలో నీటివసతి కింద పండించేందుకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు విత్తనం విత్తే మొదలు కోత వరకు పూర్తిగా యాంత్రీకరణకు అనుకూలమైన పంట.

READ ALSO : Intercropping In Kandi : కందిలో అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం

కందిని అన్ని రకాలు నేలల్లో సాగు చేసుకోవచ్చు. అయితే ఖరీఫ్‌లో ఇప్పటివరకు రైతులు కందిలో మధ్యకాలిక రకాలను సాగు చేస్తూ.. వచ్చారు. దీంతో పంట చివరి దశలో బెట్ట పరిస్థితుల మూలంగా దిగుబడులు తగ్గి.. రైతులు నష్టపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మద్యస్థ స్వల్పకాలిక రకాలకు రూపొందించారు.

READ ALSO : Redgram Crop : కందిపంటలో చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు !

వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వారు ఐదు నూతన కంది రకాలను విడుదల చేశారు. అయితే వాటి గుణగణాలు ఏంటో తెలియజేస్తున్నారు పరిశోధనా స్థానం సీనియర్‌ శాస్త్రవేత్త సంధ్యాకిషోర్‌.